Vishnupriya:యాంకర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో విష్ణు ప్రియ (Vishnu Priya) కూడా ఒకరు.. ‘పోవే పోరా’ అనే షోతో ఫేమస్ అయిన విష్ణు ప్రియ ఆ తర్వాత పలు షోలలో యాంకర్ గా అలాగే బిగ్ బాస్ వంటి రియాల్టీ షోకి కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన పర్ఫామెన్స్ తో అందరి మనసులు గెలిచింది. అయితే అలాంటి విష్ణు ప్రియ ఇండస్ట్రీలోకి రావడానికి ఒక కారణం ఉందట. అదేంటో ఇప్పుడు చూద్దాం.. యాంకర్ విష్ణు ప్రియ పోవే పోరా షో తోనే అందరికీ తెలుసు.కానీ పోవే పోరా షో కంటే ముందు ఆమె పలు షార్ట్ ఫిలిమ్స్ అలాగే ఫన్ బకెట్ వంటి వాటిలో చేసింది.
విష్ణు ప్రియ ఇండస్ట్రీ ఎంట్రీ భలే విచిత్రంగా ఉందే..
ఇక విష్ణు ప్రియ మొదటిసారి ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు అనుకుందంటే తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇవ్వడం కోసమట. అవును మీరు వినేది నిజమే.. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా విష్ణు ప్రియ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. విష్ణు ప్రియ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి మొట్టమొదటిసారి ఎంట్రీ ఇచ్చింది ఓ షార్ట్ ఫిలిం ద్వారా. అయితే ఆ షార్ట్ ఫిలిం లో నటిస్తే డబ్బులు వస్తాయి.ఆ డబ్బులతో నా మొదటి బాయ్ ఫ్రెండ్ కి ఒక గిఫ్ట్ కొనిద్దాము అనే ఉద్దేశంతోనే షార్ట్ ఫిలిం చేసాను. ఇక ఈ షార్ట్ ఫిలిం మంచి హిట్ అవ్వడంతో ఆ తర్వాత నాకు ఫన్ బకెట్ లో ఛాన్స్ వచ్చింది.ఫన్ బకెట్ కూడా చేయడంతో పాపులర్ అయ్యాక పోవే పోరా షో కోసం యాంకర్ కావాలంటే ఆడిషన్ కోసం వెళ్లాను.
బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్ కొనడం కోసమే ఇండస్ట్రీలోకి వచ్చా..
అలా ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యాక పోవే పోరా షో లో సుధీర్ పక్కన యాంకర్ గా చేశాను. ఈ షోతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఎన్నో షోలలో ఆఫర్స్ వచ్చాయి. ఫస్ట్ టైం నా మొదటి బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ డబ్బుల కోసం సరదాగా షార్ట్ ఫిలిం చేశాను.ఆ తర్వాత ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది అంటూ చెప్పుకొచ్చింది.. ఇక విష్ణు ప్రియ బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలోకి కంటెస్టెంట్ గా వెళ్లి అక్కడ సీరియల్ నటుడు పృథ్వీతో ప్రేమలో పడి, ఆ షోలో చేసిన హంగామా అంతా కాదు. చివరికి షో బయట కూడా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు వీరి ప్రవర్తనతో చాలా మందిలో అనుమానాలు కలుగుతున్నాయి. అటు పృథ్వీ తల్లి కూడా విష్ణు ప్రియా ను కోడలిగా తెచ్చుకోవాలని చూస్తున్నట్లు బిగ్ బాస్ లో కాస్త ఇంటి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పలు షోలలో కూడా వీరిద్దరు జంటగా కనిపించి, ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. మరి చూద్దాం భవిష్యత్తులో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందేమో..
ALSO READ:Manchu Manoj: ఆ బాధ నేనూ అనుభవించా… సారీ వదిలేయండి అంటూ మనోజ్ ఆవేదన..!