BigTV English

Raja Saab : హమ్మయ్య.. ఎట్టకేలకు థియేటర్లలోకి అడుగుపెట్టబోతున్న ‘రాజా సాబ్ ‘.. ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా..

Raja Saab : హమ్మయ్య.. ఎట్టకేలకు థియేటర్లలోకి అడుగుపెట్టబోతున్న ‘రాజా సాబ్ ‘.. ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా..

Raja Saab : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ప్లాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. గత ఏడాది కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ హీరో ఇప్పుడు రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో ప్రభాస్ కనిపించడంతో.. ఈ మూవీ ని చూడ్డానికి గత కొన్ని నెలలుగా డార్లింగ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. అయితే ఈ మూవీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో ఈ సినిమా సమ్మర్ రేస్ నుంచి తప్పుకుంది.. ఇప్పుడు తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఆ డేట్ నే మూవీ రాబోతుందని ఓ వార్త అయితే చక్కర్లు కొడుతుంది. అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


రాజా సాబ్ కొత్త రిలీజ్ డేట్ ఇదే..?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్ మూవీ పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ లో ప్రభాస్ తాతగా, మనవడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో మాళవికా మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్దికుమార్ హీరోయిన్‌లుగా నటిస్తుండగా.. కీలక పాత్రలో సంజయ్‌దత్, అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. ఈ మూవీలో నయనతార స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుంది. ఇటీవల రిలీజైన ఈ చిత్ర టీజర్ లో మే నెలలో రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఇంకా కొన్ని ముఖ్యమైన పనులు పెండింగ్ ఉండడంతో ఈ సినిమా వాయిదా పడిందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా మే నుంచి డిసెంబర్ కి షిఫ్ట్ అయినట్లు ఓ వార్త సినీ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ 5న ఈ మూవీ థియేటర్లలోకి గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ డేట్ పై త్వరలోనే అధికారక ప్రకటన రాబోతుంది. ఏది ఏమైనా కూడా ఈ డేటు పై ఫ్యాన్స్ కూడా నమ్మకంగా ఉన్నారు. మరి మారుతి ఆలోచనలు ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..


Also Read :మోహన్ బాబుపై మనోజ్ కుట్రలు చేయలేదు.. మంచు ఫ్యామిలీ మ్యాటర్స్ లోకి నిర్మాత సురేష్ బాబు…

రాజా సాబ్ ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటి..?

రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఎప్పుడూ అరడజను సినిమాలో ఉంటాయి. అయితే థియేటర్లలోకి మాత్రం కేవలం ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు.. ఈ ఏడాది మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ మూవీతో రాబోతున్నాడు.. ఈ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎప్పటినుంచో కళ్ళకు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకు సినిమా షూటింగ్ పూర్తవకపోవడంతో రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తుంది..వీఎఫ్ఎక్స్ కారణంగా లేట్ అవుతోందని, టీజర్ రెడీగా ఉన్నా ప్రభాస్ నుంచి ఇంకా అనుమతి రాలేదని రూమర్స్ వచ్చాయి. ఇక ఫైనల్‌గా అసలు టీజర్ ఉందా లేదా అనే విషయంపై, మారుతీ సన్నిహితుడు, తన సహా నిర్మాత అయినటువంటి మాస్ మూవీ మేకర్స్ నిర్మాత ఎస్ కె ఎన్, తాజాగా క్లారిటీ ఇచ్చాడు. సో ఈ సినిమా రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలంటే ఇంకోక వారం వెయిట్ చెయ్యాల్సిందే మరి..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×