BigTV English

Kakani Arrest: కాకాణి అరెస్ట్.. వైసీపీలో టెన్షన్‌ టెన్షన్‌

Kakani Arrest: కాకాణి అరెస్ట్.. వైసీపీలో టెన్షన్‌ టెన్షన్‌

Kakani Arrest: రుస్తుం మైన్స్ కేసులో అరెస్ట్ అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఇవాళ వెంకటగిరి కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఆయన్నిఆదివారం బెంగళూరు శివార్లలో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ4గా ఉన్న ఆయన పోలీసుల విచారణకి హాజరుకాకుండా ఆయన 2 నెలల నుంచి పరారీలో ఉన్నారు. నెల్లూరులో ఒకసారి, హైదరాబాదులో 2 సార్లు కాకాణి కుటుంబ సభ్యులకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ, ఆయన మాత్రం ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు.


 బెంగళూరు శివార్లలో పట్టుబడిన కాకాణి గోవర్ధన్
బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయిస్తే అక్కడ కాకాణికి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో పోలీసులు ఆయన కోసం 4 రాష్ట్రాల్లో గాలింపులు చేపట్టారు. విమానాశ్రయాలకు లుక్‌ అవుట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. చివరికి నిన్న బెంగళూరు శివార్లలో ఆయన పోలీసులకు పట్టుబడ్డారు. ఆ తర్వాత నెల్లూరుకి తీసుకొచ్చి జిల్లా పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో రాత్రి పోలీసులు విచారించారు. వెంకటాచలం ఆస్పత్రిలో రాత్రే వైద్య పరీక్షలు చేయించారు.

వైసీపీ హయాంలోనే కాకాణిపై టీడీపీ ఫిర్యాదు


వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన కాకాణి గోవర్థన్ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం రుస్తుం మైన్స్‌లో అక్రమంగా కార్ట్జ్‌ ఖనిజం కొల్లగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలోనే టీడీపీ నేతలు ఆయనపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవు. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ ఫిర్యాదుల్లో కదలిక వచ్చింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు మాజీ మంత్రి కాకాణి 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్‌ను అక్రమంగా తరలించినట్టు తేల్చారు.

మార్చి 24న 10 మందిపై నమోదు

ఆ తర్వాత మార్చి 24న 10 మందిపై నమోదు చేశారు. ఈ కేసులో కాకాణిని ఏ-4గా చేర్చారు. కేసు నమోదైన తర్వాత ఆయనకు మార్చి 25న తొలిసారి నోటీసులు ఇవ్వడానికి వెళ్లారు. అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడంతో.. ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో కాకాణి ఇంటికి కూడా పోలీసులు 2 సార్లు వెళ్లినా ఆయన లేకపోవడంతో గేటుకు నోటీసులు అతికించారు. ఆ తర్వాత లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి నాలుగు టీములు గాలించాయి.

నెల్లూరు జిల్లాలో ఫిబ్రవరిలో నమోదైన కేసు

నెల్లూరు జిల్లాలో అక్రమంగా ఖనిజ సంపదను వెలికితీసి, అక్రమంగా రవాణా చేశారన్న ఆరోపణలపై గనులు, భూగర్భ వనరుల శాఖ ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆయనకు నోటీసులు జారీ చేసినప్పటికీ, కాకాణి పోలీసుల ఎదుట హాజరు కాలేదు. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న ఆయన, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు రిలీఫ్ లభించలేదు. దేశం విడిచి పారిపోకుండా నిరోధించడానికి గత నెలలో పోలీసులు కాకాణిపై లుక్అవుట్ నోటీసు కూడా జారీ చేశారు.

అక్రమ తవ్వకాలు, రవాణా ఆరోపణలు

వైసీపీ పాలనలో నెల్లూరు జిల్లాలో కాకాణి అక్రమ క్వార్ట్జ్ మైనింగ్‌కు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలున్నాయి. తాటిపర్తి సమీపంలో మైకా మైనింగ్ లీజు గడువు ముగిసినప్పటికీ, పొదలకూరు మండలం తోడేరు గ్రామం వద్ద క్వార్ట్జ్ తవ్వకాలు అక్రమంగా కొనసాగాయని ఆరోపణలున్నాయి. గనులు, భూగర్భ వనరుల శాఖ జరిపిన విచారణలో 61వేల 313 మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్‌ను అక్రమంగా వెలికితీసి రవాణా చేసినట్లు, దీని ద్వారా జరిమానాలతో సహా ప్రభుత్వానికి సుమారు 7.56 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తేలింది.

Also Read: వంశీ కోసం నాని వీరంగం.. క్షమాపణ చెప్తాడా?

కాగా.. కాకాణిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదే విషయమై పోలీసులు అధికారికంగా ధ్రువీకరించకపోవడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.కాకాణికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.అరెస్ట్‌లతో వైసీపీని అణగదొక్కాలంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని చెప్పారు.కుట్రలతో నిరాధారమైన కేసులు పెడుతున్నారని.. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్షం పై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.కాకాణికి జిల్లా పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కాకాణిని అదుపులోకి తీసుకోవడంపై జిల్లా పోలీస్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×