Big Stories

Ambedkar Konaseema: కోనసీమ జిల్లాలో విషాదం.. అంతర్వేది బీచ్ లో యువ జంట గల్లంతు..

Ambedkar Konaseema: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది బీచ్ లో యువ దంపతులు గల్లంతు అయ్యారు. రేలంగి లక్ష్మీనారాయణ, గాయత్రి పశ్చిమగోదావరి జిల్లా జువ్వలపాలెం గ్రామానికి చెందినవారు. వారికి నెల రోజుల క్రితమే పెళ్లి అయ్యింది. కార్తీకమాసం సందర్భంగా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి అంతర్వేది వచ్చారు.

- Advertisement -

అంతర్వేది బీచ్ లో 500 మీటర్ల దూరంలో అందరూ చూస్తుండగానే సముద్రంలోకి వెళ్లారు. ఆ తర్వాత గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్ ఒడ్డున లభ్యమైన ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు . దంపతుల జాడ తెలియకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News