BigTV English
Advertisement

AP : బీహార్ కాదు, భీమవరం.. కాలేజ్ బస్సుపై మందుబాబులు దాడి, అంతా టీనేజర్లే!

AP : బీహార్ కాదు, భీమవరం.. కాలేజ్ బస్సుపై మందుబాబులు దాడి, అంతా టీనేజర్లే!

AP : ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారంటారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో తాగుబోతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నకిలీ సరుకుకు అలవాటు పడి ఒళ్లు హూనం చేసుకున్నారు చాలామంది. అదే తాగుడు అలవాటు ఇప్పటికీ వదలలేకపోతున్నారు. మైనర్లు సైతం మందుకు బానిసలుగా మారుతున్నారు. గంజాయి కొడుతున్నారు. లేటెస్ట్‌గా భీమవరంలో ఓ మైనర్ గ్యాంగ్.. ఫుల్లుగా తాగేసి.. రోడ్డుపై నానా రచ్చ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


భీమవరంలో తాగుబోతుల వీరంగం

భీమవరం. ఒకప్పుడు ప్రశాంత నగరం. రాజుల ఆధిపత్యం. అలాంటి భీమవరం ఇప్పుడు తాగుబోతుల రాజ్యంగా మారింది. తప్పతాగి కొందరు కుర్రాళ్లు నడిరోడ్డుపై రెచ్చిపోయారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నామో తెలీకుండా ప్రవర్తించారు. ఓ 8 మంది పిల్లలు బాగా తాగేసి ఉన్నారు. రోడ్డుపై వెళుతున్నారు. వారి పక్క నుంచి ఓ కాలేజ్ బస్ వెళ్తోంది. ఓ తాగుబోతు కుర్రాడు.. బస్సులో కిటికీ పక్కన ఉన్న ఓ విద్యార్థిని కొట్టేసి పరుగులు పెట్టాడు. ఎందుకు కొట్టాడంటే కారణం కూడా లేదు. జస్ట్ ఊరికే అలా కొట్టాడు. వాడిలోని మద్యం, గంజాయి వాడితో అలా కొట్టించింది అంతే.


నడిరోడ్డుపై మైనర్ల రచ్చ

అలా ఊరికే కొడితే ఊరుకుంటారా? ఆ స్టూడెంట్ బస్ దిగి కిందకు వచ్చాడు. కొట్టిన కుర్రాడిని దొరకబట్టి ఎందుకు కొట్టావని ప్రశ్నించాడు. అంతే. ఆ తాగుబోతు పిల్లాడు రెచ్చిపోయాడు. తననే పట్టుకుంటావా అంటూ పిడిగుద్దులు గుద్దాడు. మత్తులో ఉన్న ఆ కుర్ర గ్యాంగ్ అంతా కలిసి.. ఆ విద్యార్థిని కొట్టారు. మరో స్టూడెంట్ వచ్చి ఫ్రెండ్‌ను తీసుకెళ్లిపోయాడు. అయినా, ఆ తాగుబోతు పిల్లలు ఆగట్లేదు. బస్సు దగ్గరికి వచ్చి మరోసారి గొడవ పడేందుకు ట్రై చేశారు. కానీ, స్థానికులు వచ్చి అడ్డుకుని అక్కడినుంచి పంపించేశారు. వెళ్తూ వెళ్తూ ఆ కుర్రాళ్లు రోడ్డుపై డ్యాన్సులు చేసుకుంటూ.. ఊగుతూ, తూలుతూ నానా న్యూసెన్స్ చేశారు. ఇదంతా ఆ ఏరియాలోని సీసీకెమెరాల్లో రికార్డ్ అయింది.

Also Read : జ్యోతిర్లింగ క్షేత్రంలో కొట్టుకున్న యాత్రికులు.. వైరల్ వీడియో

సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

ఆ కుర్రాళ్లను చూస్తే చాలా చిన్న ఏజ్. ఆ ఎనిమిది మంది పిల్లలే. మూతి మీద మీసాలు కూడా రాలేదు. ఆ వయస్సులో అంతగా తాగుడుకు ఎందుకు అలవాటు పడ్డారు. అసలు 18 ఏళ్లు కూడా నిండని ఆ పిల్లలకు మద్యం ఎవరు అమ్మారు? ఏదో చాటుగా కొన్నారే అనుకున్నా.. ఏపీలో ఇంతటి తాగుబోతులు ఎలా తయారయ్యారు? స్కూల్‌కు వెళ్లాల్సిన వయస్సులో.. ఇలా తప్పతాగి రోడ్డు మీద తీట పనులు చేస్తూ.. గొడవలకు దిగుతూ.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? భీమవరంలో ఇలాంటి బేవార్స్ తాగుబోతు, గంజాయి బ్యాచ్‌లను అలా ఎలా వదిలేస్తున్నారు? వారి పేరెంట్స్ ఏం చేస్తున్నట్టు? పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఏమైపోతోంది రాష్ట్రం? తాగుబోతుల అడ్డాగా మారుతోందా?

Related News

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Big Stories

×