Doctor Misbehave Flight Crew| విమానంలో ఒక మహిళా ప్రయాణికురాలు విమాన సిబ్బందితో చిన్న విషయంపై గొడవ పడింది. వారు ఎంత చెప్పినా ఆమె వినలేదు. తోటి ప్రయాణికులతో కూడా అసభ్యంగా మాట్లాడింది. అంతేకాకుండా తనకు విసిగిస్తే విమానాన్ని గాల్లోనే కూల్చేస్తానని బెదిరించింది. ఒక డాక్టర్ కావడం మరో విశేషం. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బెంగుళూరు నుంచి గుజరాత్ లోని సూరత్ నగరానికి బయలుదేరబతున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX2749 మంగళవారం బెంగుళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో రెడీ ఉంది. ఆ సమయంలో ఆ విమానంలో సూరత్ నగరానికి చెందిన వ్యాస్ హీరల్ మోహన్‌భాయ్ (36) అనే ప్రయాణికురాలు బోర్డింగ్ చేసింది. అమె వృత్తి రీత్య ఒక డాక్టర్. ఆమె విమానంలోకి ప్రవేశించాక తన బ్యాగేజ్ ని ముందు వరుసలో ఉన్న బ్యాగేజ్ ఓవర్ హెడ్ కంపార్ట్ మెంట్ లో పెట్టేసి.. ఆ తరువాత దూరంగా ఉన్న 20f సీటులో కూర్చొంది. అయితే ఆమె బ్యాగేజ్ తనకు అడ్డంగా ఉందని.. ఆ స్థలంల తన బ్యాగేజ్ కోసం కేటాయించిందని మరో ప్రయాణికుడు ఆమెతో చెప్పాడు. కానీ ఆమె తన బ్యాగేజ్ అక్కడి నుంచి తీసేది లేదని స్పష్టంగా చెప్పింది.
దీంతో సదరు ప్రయాణికుడు విమాన సిబ్బందికి వ్యాస్ హీరల్ పై ఫిర్యాదు చేశాడు. విమాన సిబ్బంది వ్యాస్ హీరల్ కు తన బ్యాగేజ్ అక్కడి నుంచి తీసి తనకు కేటాయించిన సీటు వద్దే పెట్టుకోవాలని సూచించారు. కానీ ఆమె మాత్రం తాను అలా చేసేది లేదని వాదించింది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని అలా చేయకూడదని విమాన సిబ్బంది వారించినా ఆమె వినలేదు. చివరకు విమాన పైలట్ ఆ గొడవ గురించి తెలుసుకొని అక్కడికి చేరుకున్నాడు. ఆమెను విమాన ప్రయాణ నిబంధనలను పాటించాలని కోరాడు. దీంతో ఆమె కోపంగా మాట్లాడుతూ.. తనను విసిగిస్తే.. విమానాన్ని గాల్లో నుంచి కూల్చేస్తానని బెదిరించింది.
ఆమె బెదిరింపులు విన్న విమాన పైలట్.. టేకాఫ్ చేయకుండా ఆపేశాడు. వెంటనే ఎయిర్ పోర్ట్ పోలీసులకు సమాచారం అందించాడు. చివరికి పోలీసులు కలుగుజేసుకొని సదరు మహిళా డాక్టర్ ని అదుపులోకి తీసుకుని వెళ్లిపోయారు. ఆమె గురించి విచారణ చేయగా.. ఆమె బెంగుళూరులోని యెలహంక ప్రాంతంలోని శివన్నహళ్లి లో నివసిస్తోందిని తెలిసింది. విమాన ప్రయాణంలో నిబంధనలను పాటించకపోవడం, తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం, విమాన సిబ్బందిని విమానం కూల్చేస్తానని బెదిరించడం వంటి నేరారోపణల చేస్తే పోలీసులు ఆమెపై సివిల్ ఏవియేషన్ చట్టాల కింద కేసు నమోదు చేశారు.