BJP MLA Abuse Vande Bharat Passenger| ఒక ట్రైన్ లో ప్రయాణిస్తున్న యాత్రికుడిపై ఒక ఎమ్మెల్యే, అతని అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ నుంచి భోపాల్ నగరానికి వెళుతున్న వందే భారత్ ట్రైన్ లో జరిగింది.
వందే భారత్ ట్రైన్ లోని ఎగ్జిక్యూటివ్ కోచ్ లో ఒక ప్రయాణికుడిపై ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు. ట్రైన్.. ఝాన్సీ రైల్వే స్టేషన్ లో ఉండగా ఈ ఘటన జరిగింది. రాజ్ ప్రకాశ్ అనే వృద్ధ ప్రయాణికుడికి ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావమైంది. ఈ దాడి తనపై చేయించింది బిజెపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పరిచ్చా అని ఆరోపించాడు. ఆ ఎమ్మెల్యే ఆదేశాల మేరకే అతని అనుచరులు తనను కొట్టారని.. ఇదంతా వారు చెప్పినట్లు తన సీటు ఇవ్వకపోవడం వల్లే జరిగిందని చెప్పాడు.
ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పరిచ్ఛాతో పాటు అతని భార్య కమ్లీ సింగ్, వారి కుమారుడు శ్రేయాంశ్ సింగ్ కూడా రైలులో ఉన్నారు. ప్రయాణికుడు రాజ్ ప్రకాశ్‌కు చెందిన సీటు నంబర్ 49.. ఒక విండో సీటు.. ఆ సీటు తన కుటుంబం కోసం ఖాళీ చేయాలని ఎమ్మెల్యే అదేశించాడు. ఎమ్మెల్యే సీట్లు నంబర్లు 8, 50, 51గా ఉన్నాయి. కానీ సీటు మారడానికి రాజ్ ప్రకాశ్ నిరాకరించగా.. వాగ్వాదం మొదలైంది. కోపంతో ఎమ్మెల్యే తన సహాయకులను పిలిచి, ఝాంసీలో రైలు ఆగినప్పుడు రాజ్ ప్రకాశ్‌ను కొట్టమని ఆదేశించాడు. ఆ తర్వాత రైలు భోపాల్‌కు బయలుదేరింది.
రైల్వే పోలీస్ (GRP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రైల్వే అధికారులు ఈ సంఘటన గురించి ధృవీకరించారు. కానీ మీడియా ముందు మాట్లాడేందుకు నిరాకరించారు. ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పరిచ్ఛా తన వైపు రాతపూర్వకంగా వివరిస్తానని చెప్పాడు. ఝాంసీ రైల్వే పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించిన కేసు నమోదైంది.
రైలులో ఏం జరిగింది?
సంఘటన రోజు రాజీవ్ సింగ్ పరిచ్ఛా తన కుటుంబంతో రైలు నంబర్ 20172 ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో ప్రయాణిస్తున్నాడు. అతని భార్యకు సీటు 50, కుమారుడికి 51, అతనికి 8 ఉన్నాయి. రాజ్ ప్రకాశ్ సీటు 49లో ఉన్నాడు. రైలు ఝాంసీకి చేరుకున్నప్పుడు ఆరుగురు వ్యక్తులు కోచ్‌లోకి వచ్చి అతడిపై దాడి చేశారు. దాడి ఎంతో తీవ్రంగా ఉండడంతో అతని ముక్కు, ముఖం నుండి రక్తస్రావమైంది. ప్రయాణికుడు తేరుకునే లోపే రైలు భోపాల్‌కు బయల్దేరింది.
Also Read: చనిపోయిన విష సర్పం..మనిషిని కాటేసిన 5 నిమిషాల్లోనే.. అతడి రక్తంలో ఏముందంటే
రైల్వే ప్రయాణికుడిపై దాడిని వ్యతిరేకించిన కాంగ్రెస్
ఈ ఘటనపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకులు ముకేష్ నాయక్, రామ్‌నివాస్ రావత్ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే, అతని అనుచరులు రౌడీయిజానికి పాల్పడ్డారని, రైల్వే ప్రయాణికులకు భద్రత లేదా? అని ప్రశ్నించారు. బిజేపీ పాలనలో ఈ రౌడీయిజం జరుగుతోందని తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ ఘటన గురించి తెలిసినా పోలీసులు బిజపీకి భయపడి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. రైళ్లలో సామాన్యులకు భద్రత లేదా? అని తాజా ఘటనను ఉదాహరణగా ఎత్తిచూపారు.