Viral Video : కేదార్‌నాథ్. హిందువులకు పరమ పవిత్రమైన ప్రదేశం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. చార్‌ధామ్ యాత్రలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సముద్ర మట్టానికి సుమారు 3,500 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయం. శీతాకాలంలో మంచులో కూరుకుపోతుంది. ఆ సీజన్‌లో టెంపుల్ మూసేస్తారు. మళ్లీ వేసవిలో తెరుస్తారు. ఈ యేడాది మే 2 ఆలయం తెరవగా.. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా యాత్రికులు సందర్శించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగలో ఉన్న కేదార్‌నాథ్‌లో పటిష్ట భద్రత కల్పించారు. అయితే.. పుణ్యక్షేత్రానికి వచ్చే సందర్శకులు అప్పుడప్పుడూ అదుపు తప్పుతుంటారు. గొడవకు దిగుతుంటారు. లేటెస్ట్‌గా కేదార్‌నాథ్‌లో యాత్రికులు కొట్టుకున్న వీడియో తెగ వైరల్ అవుతోంది.
యాత్రికుల కొట్లాట..
అది కేదార్‌నాథ్‌లో వాహనాల పార్కింగ్ ఏరియా. చాలా వెహికిల్స్ ఉన్నాయి. అక్కడ ఏం గొడవ జరిగిందో ఏమో కానీ.. కొందరు యువకులు పెద్ద పెద్ద కర్రలతో కొట్టుకుంటున్నారు. రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్. మొదట వాళ్లు వీళ్లు చూసుకుందాం అంటే చూసుకుందాం అన్నట్టు రెచ్చిపోయారు. ఫైటింగ్ స్టార్ట్ అయ్యాక ఒక టీమ్‌కు బాగా దెబ్బలు తగిలాయి. దీంతో ఆ గ్రూపు వాళ్లు ఒక్కొక్కరూ మెళ్లిగా అక్కడి నుంచి పరార్ అయ్యారు. మిగతా వారు అపొజిట్ టీమ్‌కు చిక్కారు. వారిని పట్టుకుని.. కర్రలతో చితకబాదారు. ఒళ్లు వాచిపోయేలా కొట్టారు.
Also Read : విమానంలో 11A సీటు కోసం గొడవ.. వీడియో వైరల్
ఆ కొట్లాట చూడలేక అక్కడ ఉన్న కొందరు యాత్రికులు ఆ యువకులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. మొదట వారిని పట్టించుకోకుండా ఎడాపెడా బాదేశారు. కోసం, కసి తీరాక.. కాస్త కూల్ అయ్యారు. అందరూ నచ్చజెప్పడంతో కొట్టడం ఆపేశారు. పాపం.. బాధిత యాత్రికులకు బాగా దెబ్బలు తగిలాయి. ఆ దెబ్బలాటను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తే అది తెగ వైరల్ అవుతోంది.
పవిత్ర ప్రదేశంలో ఇవేం పనులు?
గుడికి వెళ్లినప్పుడు గుండెల నిండా భక్తి ఉండాలి.. మనస్సులో ప్రశాంతత ఉండాలి.. బుద్ధి శాంతితో ఉండాలి కానీ.. ఇలా బరితెగించి వీధి రౌడీల్లా కర్రలతో కొట్టుకోవడం ఏంటి? జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రంలో ఈ అరాచకాలేంటి? అంటూ నెటిజన్లు కామెంట్లతో శాపనార్థాలు పెడుతున్నారు.
जब हिंसा ही करनी है, लाठी डंडे ही चलाने है तो फिर धार्मिक यात्रा पर आने का क्या फायदा ? केदारनाथ यात्रा मार्ग पर सीतापुर पार्किंग में तीर्थ यात्री आपस में भिड़े, लाठियों से किए एक-दूसरे पर वार। #kedarnath #sitapur #gaurikund pic.twitter.com/WUabA48nrc
— Ajit Singh Rathi (@AjitSinghRathi) June 19, 2025