E-Paper
Advertisement

వైష్ణవి సోనీ క్రేజ్ మామూలుగా లేదుగా.. వరుసగా హిట్ల మీద హిట్లు!

వైష్ణవి సోనీ క్రేజ్ మామూలుగా లేదుగా.. వరుసగా హిట్ల మీద హిట్లు!
Advertisement

Vaishnavi Sony:వైష్ణవీ సోనీ ..వైష్ణవీ సోనీ ..వైష్ణవీ సోనీ .. ఎక్కడ చూసినా ఈ పేరే ఇపుడు సాలిడ్ గా వినిపిస్తుంది.ఫోక్ సాంగ్ చేయాలంటే వైష్ణవీ సోనీ ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నట్టుగా తయారైంది.ఈ అమ్మడు చేసిన సాంగ్స్ ఇపుడు మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతున్నాయి మరి.

వీరి కాంబోలో వచ్చిన బాసింగ బలాలు

Advertisement

ఇక ఈ క్రమంలోనే తాజాగా వైష్ణవీ సోనీ స్టెప్పులేసిన మరో‘గున్న గున్నవోయే సిన్నది’ అనే పాట కూడా ఇపుడు నెట్టింట్లో సంచలనం స్ప్రుష్టిస్తుంది. ఈ ఏడు ఏప్రిల్ 30న వదిలిన ఈ పాట ఇప్పటికే ఏకంగా 32 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టింది అంటే వైష్ణవీ సోనీ ఆడియన్స్ ని ముఖ్యంగా ఫోక్ లవర్స్ ని ఎంతలా మెస్మరైజ్ చేసిందో అర్థమవుతుంది.ఇక ఈ పాటలో వైష్ణవీ సోనీకి జతగా ఈశ్వర్ సాయి స్టెప్పులేయడం కూడా పాటకి మరింత కలిసి వచ్చిందని చెప్పాలి.ఇక వీరి కాంబోలో వచ్చిన బాసింగ బలాలు పాటనెట్టింటిని ఏ రకంగా షేక్ చేశాడో ఆ పాటకి వచ్చిన 273 మిలియన్ల వ్యూసే చెబుతున్నాయి.

Advertisement

ఇక పాట విషయానికి వస్తే తెలంగాణ యాసతో పల్లెటూరి వాతావరణంతో వినసొంపైన మట్టి పదాలతో నిండిన ఈ పాటని sv మల్లిక్ తేజ రాసి, సంగీతం అందించడమే కాకుండా పాటకి దర్శకత్వం వహించడం విశేషం.ఇక ఇదే పాటతో లచ్చు మక్క బడుగు సింగర్ గా పరిచయం కాగా తనతో sv మల్లిక్ తేజ కలిసి గాత్రం అందించడం మరో విశేషం. ఇక ఎప్పటిలాగే వరుస ఫోక్ సాంగ్స్ కో కొరియోగ్రఫీ చేస్తూ ఫోక్ ఇండస్ట్రీని తన స్టెప్పులతో శాసిస్తున్న శేఖర్ వైరసే ఈ పాటకి కూడా కొరియోగ్రఫీ చేయడంతో పాట మరో లెవెల్ కి వెళ్లిపోయింది.

సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన గంగవ్వ

అయితే అన్నిటింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ పాటలో వైష్ణవీ సోనీ, ఈశ్వర్ సాయిలతో పాటు ప్రధానంగా కనిపించిన గంగవ్వ గురించి. మై విలేజ్ షోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన గంగవ్వ ఈ పాటలో తళుక్కుమనడంతో పాటకి రిపీట్ వాల్యూ పెరిగిపోయింది. ఇక రాజ్ కుమార్ పాటకి కావాల్సిన విధంగా ప్రొడక్షన్ వాల్యూస్ సమకూర్చడంలో సక్సెస్ అయ్యాడని అందగా కనిపిస్తున్న ప్రతీ ప్రేమ్ చెబుతూనే ఉంది.

అయితే ఈ పాటలో మొదటగా కుమ్మరోల్ల సిన్నది అనే పదం ఉండగా దాన్ని మార్చేశారు మేకర్స్,బహుశా ఆ వర్గం నుండి వచ్చిన ఒత్తిడి కాబోలు.దీంతో ఆ పదమే ఉంటె బాగుండేది అంటూ కొందరు కామెంట్స్ చేస్తే వైష్ణవీ సోనీ వల్లే ఈ పాటకి అందం వచ్చిందని, ఫోక్ ఇండస్ట్రీలో మాధురి రాథోడ్ , వైష్ణవీ సోనీ ల మధ్య ఫుల్ కాంపిటీషన్ ఉందంటూ మరి కొందరు కామెంట్స్ పెట్టుకొచ్చారు.

ఇంకెన్ని సంచలనాలు స్ప్రుష్టిస్తుందో !

ఇక ఎప్పటిలాగే అదరగొట్టిన వైష్ణవీ సోనీ విషయానికి వస్తే ఈ మధ్యే బిందె మీద బిందె పెట్టి అంటూ వరిజినల్ సాంగ్ లో నాగవ్వతో అదరగొట్టిన సంగతి తెల్సిందే.ఇక వీరి కాంబోలోనే ఎద్దు వొచ్చే ముద్దువెట్టె పాట కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెల్సిందే,అలాగే తట్టుకోలేనే, గుజ్జారి 2, మల్లె చెట్టు కింద కూసున్న అనే పాటలు వైష్ణవీ సోనీకి మంచి పేరు తెచ్చి పెట్టినవే.చూడాలి మరి ముందు వైష్ణవీ సోనీ ,ఈశ్వర్ సాయిల కాంబో ఇంకెన్ని సంచలనాలు స్ప్రుష్టిస్తుందో !

Tags

Related News

సలహా ఇస్తూనే ఏడిపించేసిన వీ.జే.సన్నీ.. ప్రియాంక ప్రవర్తనపై శివ్ తో ఏమన్నారంటే?

మెహబూబ్ తో లవ్.. స్పందించిన శ్వేతా నాయుడు!

చె*ప్పుతో కొడతా.. మనుషులేనా.. ట్రోలర్స్ పై ఫైర్ అవుతున్న రాధమ్మ కూతురు!

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భద్ర అవుట్..

Gundeninda GudiGantalu Today episode: అయ్యో సుమతికి ఏమైంది..? అరుణ్, బాలు గొడవ.. ఏడ్చిన ప్రభావతి..

Podarillu Today Episode : మహాకు సారీ చెప్పిన విక్కీ.. మహా మాటతో విక్కీ షాక్.. చక్రీ, మహా కలిసిపోతారా..?

Illu Illalu Pillalu Today Episodes: నర్మదా పై వేదవతి సీరియస్.. అంజలి పై చందు ఫైర్.. ధీరజ్ కు దొరికిన చందు..

Big Stories

Advertisement
×