BigTV English

Tirumala: శ్రీవారిని దర్శించిన రోజా ఏం చెప్పారంటే? తిరుమల భక్తుల రద్దీ లేటెస్ట్ అప్ డేట్ ఇదే..

Tirumala: శ్రీవారిని దర్శించిన రోజా ఏం చెప్పారంటే? తిరుమల భక్తుల రద్దీ లేటెస్ట్ అప్ డేట్ ఇదే..

Tirumala: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసులు వెలిసిన తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా శ్రీవారికి పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్ర స్నానాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా స్వామివారికి కైంకర్యాలు నిర్వహించిన అనంతరం పల్లకిపై శ్రీవారిని ఆలయం వెలుపలకు తీసుకువచ్చారు.


వేలాదిగా హాజరైన భక్త జన సందోహం మధ్య శ్రీ వరాహ పుష్కరిణిలో శ్రీ సుదర్శన చక్రతల్వార్ కు విశేష స్వపన తిరుమంజనం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అయితే శ్రీ స్వామి పుష్కరిణితీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నానమాచరించిన వారికి 66 కోట్ల పుణ్యతీర్థ స్నాన ఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఈ కారణంగానే పుష్కరిని తీర్థంలో స్నానమాచరించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

తిరుమలలో ప్రస్తుతం సాధారణ రద్దీ కొనసాగుతోందని టీటీడీ ప్రకటించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. శ్రీవారిని 60,094 మంది భక్తులు దర్శించుకోగా, రూ. 2.45 కోట్ల రూపాయల కానుకలు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.


Also Read: 2025 Sankranthi Special Song: మా ఊరు పల్లెటూరు.. ‘బిగ్ టీవీ’లో సంక్రాంతి స్పెషల్ సాంగ్, ప్రోమో అదుర్స్!

కాగా శనివారం తెల్లవారుజామున మాజీ మంత్రి రోజా, శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వాదం ఇచ్చారు. రోజా మాట్లాడుతూ.. అందరూ సుఖశాంతులతో ఉండాలని దేవదేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. అయితే తిరుపతి తొక్కిసలాట ఘటనపై రోజా మాట్లాడేందుకు నిరాకరించి, కేవలం శ్రీవారి దర్శన భాగ్యం దక్కడం తన అదృష్టమంటూ మాట్లాడడం విశేషం.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×