HBD Sukumar : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ఎస్ ఎస్ రాజమౌళి, సుకుమార్ ఒకరు. దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రచయితగా తన కెరీర్ మొదలుపెట్టి ఆర్య సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఒక ప్రేమ కథను ఇలా కూడా చెప్పొచ్చు అని ఒక కొత్త కథనాన్ని వెండి తెరపై ఆవిష్కరించాడు. ఆర్య సినిమాతోనే అల్లు అర్జున్ స్టార్ హీరో అయిపోయాడు. ఇప్పటికీ ఆర్య సినిమా చూసిన ఒక ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. ఆర్య లాంటి క్యారెక్టర్ని సుకుమార్ డిజైన్ చేసిన విధానం చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంది. రాజమౌళి వంటి దర్శకులు సైతం నాకు సరైన పోటీ ఉన్న దర్శకుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చాడు అని ఫీలయ్యాలా చేశాడు ఆర్య సినిమాతో సుకుమార్. అయితే చదువు వంట పట్టని వాళ్లే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు అని ఒక నానుడి అప్పట్లో ఉండేది. కానీ దీనికి భిన్నంగా సుకుమార్ లెక్కల మాస్టారుగా పనిచేస్తూ సినిమాల మీద ఆసక్తితో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి సినీ రంగం వైపు అడుగులు వేశారు. అక్కడితో అంచలంచలుగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకున్నారు.
ఆర్య సినిమా తర్వాత సుకుమార్ చేసిన సినిమా జగడం. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించలేదు కానీ ఇప్పటికీ ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా సుకుమార్ భార్య తబితకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం. సుకుమార్ ఈ సినిమాలో ఎంచుకున్న పాయింట్ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. కానీ అప్పట్లో ఈ సినిమా కొందరికి ఎక్కలేదు. ఆ తర్వాత చేసిన 100% లవ్ సినిమాతో 100% సక్సెస్ సాధించాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన నేనొక్కడినే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించలేదు కానీ ఆ సినిమా కూడా ఒక కల్ట్ స్టేటస్ ఉంది. సుకుమార్ కెరియర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అంటే నాన్నకు ప్రేమతో. ఎన్టీఆర్ కెరియర్ లో కూడా ఆ సినిమా ఒక ప్రత్యేకమని చెప్పాలి. తండ్రి కొడుకులు మధ్య ఉన్న ఎమోషన్ ని తనదైన శైలిలో చూపించి ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేయడం సుకుమార్ కు మాత్రమే చెల్లింది.
సుకుమార్ కెరియర్ లో బెస్ట్ వర్క్ అంటే రంగస్థలం అని చెప్పాలి. రామ్ చరణ్ లోని పరిపూర్ణమైన నటుడును బయటకు తీసిన సినిమా రంగస్థలం. కేవలం రామ్ చరణ్ లోనే కాకుండా సుకుమార్ లోని ఒక కొత్త దర్శకుడు ఆ సినిమాతో బయటకు వచ్చాడు. ఇప్పటికీ చూసిన కూడా ఇంత గొప్ప సినిమాని సుకుమార్ ఎలా రాయగలిగాడు, ఎలా తీయగలిగాడు అని అనిపించక మానదు. చాలా బ్రిలియంట్ గా సుకుమార్ ఈ సినిమాని డిజైన్ చేశాడు. సుకుమార్ లానే సుకుమార్ సినిమాల్లో హీరోలు కూడా ఇంటెలిజెంట్ గా కనిపిస్తారు. సుకుమార్ కెరియర్లో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించిన సినిమా పుష్ప. బాక్సాఫీస్ వద్ద పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 కూడా ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
డిసెంబర్ 5 2024 ను ప్రేక్షకులు ముందుకు వచ్చిన పుష్ప 2 సినిమా అద్భుతమైన ఘనవిజయం సాధించింది. తెలుగు సినిమా చరిత్రలో అతి త్వరగా వెయ్యి కోట్లు వసూలు చేసిన సినిమాగా ఆ సినిమా రికార్డు సాధించింది. చాలా చోట్ల ఒకసారి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. తెలుగు సినిమా స్థాయిని రాజమౌళి ఏ స్థాయిలో పెంచారు అదే స్థాయిలో సుకుమార్ కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు సుకుమార్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా ఇప్పుడు దాదాపు 1700 కోట్లు పైగా వసూలు చేసింది. ఏదేమైనా ఈ లెక్కలు మాస్టారు బాక్స్ ఆఫీస్ లెక్కలను మార్చేశారు. ఇలానే తెలుగులో మరిన్ని సినిమాలు చేసి తన స్థాయిని మరింత పెంచాలని కోరుకుంటూ బిగ్ టీవీ తరపున సుకుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.