BigTV English

Samantha : మయోసైటిస్ తర్వాత మరో వ్యాధి బారీన పడ్డ సమంత… పోస్ట్ వైరల్

Samantha : మయోసైటిస్ తర్వాత మరో వ్యాధి బారీన పడ్డ సమంత… పోస్ట్ వైరల్

Samantha: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత(Samantha ) గత కొన్ని రోజులుగా చికెన్ గున్యాతో బాధపడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్నట్లు ఒక పోస్ట్ చేసింది సమంత. జ్వరం వల్ల వచ్చిన కీళ్ల నొప్పుల నుంచి కోలుకోవడం చాలా ఫన్ గా ఉందని పేర్కొంటూ వర్కౌట్ చేస్తున్న వీడియోని సమంత పోస్ట్ చేశారు. దీంతో తమ ఫేవరెట్ హీరోయిన్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే సమంత ‘మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధి నుంచి ఇటీవలే కోలుకున్న విషయం తెలిసిందే. అయితే మరొకవైపు కంటికి సంబంధించిన సమస్యలతో కూడా ఈమె బాధపడుతోంది. ఎక్కువ లైటింగ్ చూస్తే కళ్ళల్లో నీళ్లు వస్తాయని కూడా తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఒక సమస్య తర్వాత మరొకటి చుట్టుముట్టడంతో ఈమె అభిమానులు సమంతా ఆరోగ్యంగా ఉండాలి అని, ఆమె కోసం ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు సమంతపై అభిమానాన్ని చాటుకోవడానికి ఒక అభిమాని ఏకంగా తన ఇంటి వద్ద సమంతా కోసం గుడి కట్టి నిత్యం పూజలు చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు.


సమంత సినీ కెరియర్..

సమంత విషయానికి వస్తే.. ‘ఏ మాయ చేసావే’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత.. ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అల్లుడు శీను, అత్తారింటికి దారేది ఇలా పలు చిత్రాలలో నటించి, అతి తక్కువ సమయంలోనే తెలుగు నాట ప్రముఖ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ఇక తెలుగుతోపాటు తమిళ్లో కూడా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె ,,1987 ఏప్రిల్ 28న జోసెఫ్ ప్రభు – నినెట్టే ప్రభు దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి తెలుగు ఆంగ్లో – ఇండియన్ కాగా, తల్లి సిరియన్ మలయాళీ.


సమంత వ్యక్తిగత జీవితం..

ఏ మాయ చేసావే సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్య(Naga Chaitanya)తో 2010 నుండే ప్రేమాయణం కొనసాగించిన ఈమె.. పెద్దలను ఒప్పించి 2017 అక్టోబర్ 6, 7 తేదీలలో నాగచైతన్యను వివాహం చేసుకుంది. ముఖ్యంగా నాగచైతన్య హిందూ కావడం, సమంత క్రిస్టియన్ కావడంతో ఇద్దరూ కూడా వారి వారి సాంప్రదాయాల ప్రకారం రెండుసార్లు వివాహం చేసుకున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట అనూహ్యంగా 2021 అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించడంతో సమంత పై చాలామంది విమర్శించారు. ముఖ్యంగా సమంత.. నాగచైతన్యతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెడితే, నాగచైతన్య ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇక నాగచైతన్య ప్రస్తుతం శోభిత ధూళిపాళ్ల (Shobhita dhulipala )ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సమంత మాత్రం ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తుంది. అంతేకాదు బాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, ఇటీవలే ‘సిటాడెల్ హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం అక్కడే పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నట్లు సమాచారం.

Samantha Instagram Story 

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×