BigTV English

YS Jagan Kapu Politics : కాపు కాసేదెవరికి..! వైసీపీ వ్యూహం ఫలిస్తుందా..?

YS Jagan Kapu Politics : కాపు కాసేదెవరికి..! వైసీపీ వ్యూహం ఫలిస్తుందా..?

YS Jagan Kapu Politics : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కాపు సామాజికవర్గం ఓట్లే కీలకమని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ఆ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఆ క్రమంలో కాపు సామాజికవర్గం ఓట్లను ఆకర్షించేందుకు వైసీపీ కొత్తకొత్త వ్యూహాలు పన్నుతుంది. ఓ వైపు వంగవీటి, మరోవైపు ముద్రగడ కుటుంబాలను పార్టీలోకి తెచ్చుకునేందుకు వైసీపీ అధినాయకత్వం తీవ్ర కసరత్తే చేస్తోందంట. ఇప్పటికే టీడీపీతో పొత్తు ఖరారు చేసుకున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ప్రభావం నుంచి కాపుల ఓట్లు చీల్చడానికి స్కెచ్ గీస్తోందంటున్నారు.


రాష్ట్రంలో కాపు సామాజికవర్గం ఓట్లను ఆకర్షించేందుకు వైసీపీ కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తోందంటున్నారు. వారి ఓట్లు ఆకర్షించడానికి వంగవీటి, ముద్రగడ కుటుంబాలను తమతో చేర్చుకోవడానికి కసరత్తు చేస్తోందంట. అందులో భాగంగా ఇప్పటికే వంగవీటి రాధా, ముద్రగడ పద్మనాభంతో ఆ పార్టీ నేతలు పలుమార్లు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఓ వైపు టీడీపీ, జనసేన పొత్తు ఖరారైంది. కాపు వర్గీయుల ఓట్ల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రభావం ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ గట్టిగానే ఉంటుందన్న అంచనాలు వైసీపీ అధిష్ఠానాన్ని కలవరపరుస్తున్నాయంటున్నారు. అంతర్గత సర్వే రిపోర్టుల్లో అదే స్పష్టం అవుతుండటంతో ఆ గండం నుంచి గట్టెక్కేందుకు వంగవీటి రాధా, ముద్రగడ పద్మనాభంలను వైసీపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోందంట.

కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌లో 5 శాతం కాపులకు వర్తించేలా గత టీడీపీ ప్రభుత్వం శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదం కూడా పొందింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ రిజర్వేషన్‌ను అటకెక్కించేసింది. కాపుల రిజర్వేషన్‌కు బీసీలకు మధ్య లింకుపెట్టి కాపుల డిమాండ్‌ విషయంలో చోద్యం చూస్తోంది. మరోవైపు కాపులు ఓన్‌ చేసుకుంటున్న పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ నేతలు తెగ విమర్శలు గుప్పిస్తున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ పవన్‌ పర్సనల్ లైఫ్‌పై ముఖ్యమంత్రే స్వయంగా దాడి చేస్తున్నారు. విద్యార్థులు, డ్వాక్రా మహిళల సభల్లో సైతం పవన్‌పై సీఎం వ్యక్తిగత విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం అవన్నీ కాపు ఓటుబ్యాంకుపై ప్రతికూల ప్రభావాన్ని చూపబోతున్నాయని వైసీపీ సర్వేల్లో వెల్లడవ్వడంతో దిద్దుబాటు చర్యలకు దిగారంట. అందులో భాగంగానే రాధా, ముద్రగడలతో సంప్రదింపులు ప్రారంభించారంటున్నారు.


వారిద్దరి ప్రభావం కాపు ఓటు బ్యాంకుపై పని చేస్తుందని. తద్వారా పవన్‌ ఫ్యాక్టర్‌ను కొంతవరకైనా తగ్గించవచ్చని వైసీపీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. గతంలో రాధా వైసీపీలో ఉన్నప్పుడు ఆయనకు ప్రాధాన్యం ఇవ్వకపోగా. గత ఎన్నికల్లో సీటు కూడా ఖరారు చేయలేదు. ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి పోటీకి సిద్ధమైతే వేరే చోటకి వెళ్లాలని కొర్రీ పెట్టారు. దాంతో రాధా అప్పట్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. అప్పుడు పవన్‌ కల్యాణ్‌ టీడీపీతో లేకపోవడంతో కాపు ఓట్ల అంశాన్ని వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తు కుదరడం ఎప్పుడూ లేనంతగా పవన్‌ను ఆయన సామాజికవర్గం ఓన్‌ చేసుకుంటడం వైసీపీ నేతల్లో గుబులు రేపుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే 2019లో వంగవీటి రాధాను వద్దనుకున్న వారే తిరిగి పార్టీలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట.

వంగవీటి రాధాను వైసీపీలోకి తీసుకుచ్చేందుకు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో కాపుల ఓట్లు నిర్ణయాత్మకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఆ లెక్కలతోనే అటు పార్టీతో తనకూ కలిసి వస్తుందని కొడాలి నాని రాయబారానికి దిగారంట. వంగవీటి రాధాను పార్టీలోకి తీసుకువచ్చి గుడివాడ నియోజకవర్గంలో ప్రచారం చేయించుకోవడానికి కొడాలి స్కెచ్ గీస్తున్నారంట. రాధాతో మొదట్నించీ కొడాలి నానికి సాన్నిహిత్యం ఉంది. అందుకే వారు ఎప్పుడు కలుసుకున్నా ఎవరూ పట్టించుకోరని ఆ లెక్కలతోనే రాయబారి బాధ్యతను నాని తీసుకున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.

వంగవీటి రాధా పార్టీలోకి వస్తే ఆయన కోరుకుంటున్న విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ ఇవ్వడానికి కూడా వైసీపీ రెడీ అవుతోందంట. రాధాతోపాటు ఆయన సోదరికి కూడా గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏదో ఒకచోట వైసీపీ టికెట్‌ ఖరారు చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇక ముద్రగడ పద్మనాభంకు మొదట్లో రాజ్యసభ టికెట్‌ ఇస్తారనే చర్చ జరిగింది. ఇప్పుడు ఆయన కొడుకు చల్లారావు అలియాస్ గిరికి కాకినాడ లోక్‌సభ స్థానాన్ని కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అది కాకపోతే కాకినాడ లోక్‌సభ పరిధిలో ముద్రగడ ఏ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ అడిగినా ఓకే చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని వైసీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నేతల్లో జోరుగా చర్చ సాగుతోంది. వైసీపీ నుంచి ఆ మేరకు హామీలు లభించడం వల్లే కాపు ఉద్యమంలో మీరేం చేశారంటూ పవన్‌పై ముద్రగడ విరుచుకుపుడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ కుల రాజకీయంపై పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

.

.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×