BigTV English
Advertisement

YS Jagan Rayalaseema Politics : రాయలసీమలో ఊహకందని జగన్ వ్యూహాలు.. 40 సీట్లే టార్గెట్..!

YS Jagan Rayalaseema Politics : రాయలసీమలో ఊహకందని జగన్ వ్యూహాలు.. 40 సీట్లే టార్గెట్..!

YS Jagan Rayalaseema Politics : రాయలసీమ వ్యాప్తంగా ఉన్న 52 అసెంబ్లీ స్థానాలకు గాను గత ఎన్నికల్లో ఏకంగా 49 స్థానాలు సొంతం చేసుకుంది వైసీపీ. వచ్చే ఎన్నికల్లో 40 స్థానాలైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉందంట. అందులో భాగంగానే అభ్యర్ధుల మార్పులు చేర్పులు చేస్తున్నారంట. అ క్రమంలో అంతర్ జిల్లాల బదీలీలతో పాటు పక్క రాష్టాల నుంచి సైతం అభ్యర్థులను తెచ్చుకుంటుంది. ఆర్థికంగా బలంగా ఉన్న వారికి పెద్ద పీట వేస్తోంది. ఎంపిక చేసుకుంటూ టీడీపీకి అలోచించడానికి కూడా సమయం ఇవ్వడం లేదు.


రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 8 పార్లమెంటు , 52 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో సీమలో వైసీపీ 49 అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ సీట్లన్ని దక్కించుకుంది. రాష్టంలో ఆ పార్టీకి బలమైన ప్రాంతం అంటే రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి. అయితే ఇప్పటికే నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ సీన్ రివర్స్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దాంతో రాయలసీమ నుంచి అత్యధిక స్థానాలు సాధించి మరో సారి అధికార పీఠం అధిరోహించాలని బావిస్తుంది. అందులో భాగంగా అభ్యర్ధుల ఎంపికపై ప్రత్యేక ద‌ష్టి సారిస్తోంది. సామాజిక వర్గాల పరంగా రాయలసీమలో ఓటు శాతం ఎక్కువుగా ఉన్న బోయ, కురబ, మైనార్టీలకు అవకాశం ఇవ్వడం ద్వారా గెలుపు గుర్రం ఎక్కాలని భావిస్తోంది.

కర్నూలు జిల్లాలో మార్పు చేసిన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గానికి చెందిన మాచాని వెంకటేష్‌కు అవకాశం కల్పించి వైసీపీ. దాంతో పాటు అదోని నుంచి అదే వర్గానికి చెందిన ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఎంపి స్ధానానికి మంత్రి జయరాం ను రంగంలో దించనున్నారు. మరో వైపు ఆలూరు నుంచి కురబ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి అవకాశం ఇవ్వనున్నారు. అలాగే అళ్ళగడ్డ నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన శాంతారామ్‌ను బరిలోకి దించనున్నారు. కర్నూలు నుంచి మరోసారి మైనార్టీకి అవకాశం ఇవ్వనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీ‌జ్ ఖాన్‌ను తప్పించి అక్కడనుంచి మరొకరిని బరిలో దించే ఆలోచన చేస్తోందంట వైసీపీ అధిష్టానం. అనంతపురం జిల్లాలొ భారీ ఎత్తున మార్పులు చేస్తున్నారు.


హిందుపురంలో కురబ సామాజిక వర్గానికి చెందిన దీపికను ఇన్‌చార్జ్‌గా ప్రకటించారు. ముందు నుంచి అ స్థానంలో ఇన్‌చార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ ఇక్బాల్ ను తప్పించి ఆమెను తెచ్చారు . దీపిక భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. పెనుకొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌నారాయణను తప్పించి అయనను అనంతపురం ఎంపి అభ్యర్ధిగా మార్చారు.

అనంతపురం పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని అనంతపురం నగరంతో పాటు సింగనమల, ఉరవకొండ , రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలలో కురబ సామాజిక వర్గం ఓట్లు నిర్ణయాత్మకంగా ఉంటాయి. శంకర్‌నారాయణ ఆ వర్గీయులే కావంతో అసెంబ్లీ స్థానాల్లో కూడా ప్లస్ అవుతుందని వైసీపీ నమ్మకం పెట్టుకుంది. పెనుకొండలో ఉపా శ్రీచరణ్‌ను రంగంలో దింపారు. అమె భర్త రెడ్డి కావడం వల్ల ఇప్పటి వరకు శంకరనారాయణ తీరును వ్యతిరేకించిన రెడ్డి సామాజిక వర్గం తిరిగి పార్టీకి మద్దతు పలుకుతుందని బావిస్తున్నారట.

ఇక కదిరిలో సిట్టింగ్ సిద్దారెడ్డిని తొలగించి అయన స్థానంలో మక్బూల్ అహ్మద్‌ను ఇన్‌చార్జ్‌గా ప్రకటించారు. పుట్టపర్తిలో బిసికి టికెట్ ఇవ్వడానికి అభ్యర్థిని గాలిస్తున్నారు. బోయ సామాజికవర్గానికి చెందిన అనంతపురం ఎంపి రంగయ్యను కళ్యాణదుర్గం షిఫ్ట్ చేసి ఆ వర్గాన్ని ఆకట్టుకోవాలని చూస్తున్నారు.

బోయ సామాజక వర్గానికి చెందిన బళ్ళారి మాజీ ఎంపి శాంతను హిందుపురం ఎంపి అభ్యర్ధినిగా ప్రకటించారు. ఈ సెగ్మెంట్ పరిధిలోని రాప్తాడుతో పాటు పెనుకొండ , హిందుపురం లో బోయ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. వారిని ఆకట్టుకోవడానికి కర్ణాటక నుంచి ఆ వర్గానికే చెందిన శాంతను హిందూపురం తీసుకొచ్చారు. దీనికితోడు కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములుకి సోదరి అయిన శాంత అర్థికంగ బలమైన అభ్యర్థి కావడం పార్టీకి లభిస్తుందని అంటున్నారు.

చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి భూమన అభినయ్ రెడ్డిని. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఇన్‌చార్జ్‌లు ప్రకటించారు. తండ్రులు పూర్తి స్థాయిలో రాష్ట స్థాయి వ్యవహారాలు చూసుకోవడానికి వారసులను బరిలో దింపారని అంటున్నారు. అలాగే మదనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ భాషాను మార్చి అయన స్థానంలో మరో మైనార్టీకి అవకాశం కల్పిస్తారంట. పలమనేరు నుంచి బిసి అయిన వెంకటేగౌడ్ స్థానంలో కొత్తగా పార్టీలో చేరిన అర్వవైశ్య సామాజిక వర్గానికి చెందిన సుభాష్‌ను కాని బీసీ వర్గానికి చెందిన డిసిసిబి చైర్మన్ రెడ్డెమ్మను కాని రంగంలో దింపే అవకాశం ఉందంటున్నారు.

కుప్పంలో వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్ ఉన్నారు. ఈ వర్గానికి చెందిన ఓట్లరు కుప్పం నుంచి శ్రీకాళహస్తి వరకు ఉంటారు. ఆ వర్గం ఓట్లకు గాలం వేయడానికి ఇప్పటికే సుబ్రమణ్యానికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. నగరిలో కూడా చివరి నిముషంలో మార్పు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు చిన్న కొడుకు గాలి జగదీష్ నగరి టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారంట. వీరితో పాటు మంత్రి రోజా అసమ్మతి వర్గంలో ఉన్న గౌడ సామాజిక వర్గానికి చెందిన నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ శాంతి కెజె కూమార్ కూడా రేసులో కనిపిస్తున్నారు.

కడప జిల్లాకు చెందిన ఎస్సీ రిజర్వ్‌డ్ సీట్లలో కూడా మార్పులు జరగనున్నాయంట. యాదవ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించే క్రమంలో మైదుకూరు నుంచి సిట్టింగ్ అయిన రఘురామిరెడ్డి స్థానంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి వస్తారని అంటున్నారు. ఇప్పటికే వివాదాలలో చిక్కుకున్న సిఐ అంజూయాదవ్ భర్త పలుమార్లు సియం ను కలసి తనకు అక్కడ అవకాశం ఇవ్వమని కోరినట్లు సమాచారం. మొత్తం మీద సీమ వైసీపీలో సామాజిక సమీకరణలు, ఫైనాన్షియల్ లెక్కలు గట్టిగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నాయిప్పుడు. మరి ఆ లెక్కలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

.

.

Related News

AP Politics: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు

AP Politics: జగన్ టూర్లు.. బుక్కవుతున్న వైపీసీ నేతలు.. బెంబేలెత్తుతున్నారెందుకు?

Heavy Rain Alert: రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షం.. బయటకు వచ్చారో ముంచేస్తుంది..

Jagan Tour: తప్పులో కాలేసిన వైసీపీ సోషల్ మీడియా.. రైతులకు ఇంతకంటే అవమానం ఉంటుందా?

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. డిసెంబర్ లేదా జనవరిలో, ఏవియేషన్ యూనివర్సిటీ కూడా

Jogi Jagan: మిథున్ రెడ్డి అరెస్ట్ కి ఉపోద్ఘాతం.. జోగి అరెస్ట్ పై స్పందన తూతూ మంత్రం..

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Nara Bhuvaneshwari: లండన్ వేదిక.. నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 పురస్కారం

Big Stories

×