BigTV English

YS Jagan: అసెంబ్లీకి జగన్.. RRR కామెంట్స్ ప్రభావమా? షర్మిళ మాటలా?

YS Jagan: అసెంబ్లీకి జగన్.. RRR కామెంట్స్ ప్రభావమా? షర్మిళ మాటలా?

YS Jagan: ఎట్టకేలకు జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని రీతిలో తన నిర్ణయాన్ని జగన్ ప్రకటించినట్లు సమాచారం. దీనితో జగన్ తీసుకున్న నిర్ణయం పై ఏపీలో తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ఇంతకు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పిలుపు మేరకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక షర్మిళ ఇటీవల చేసిన కామెంట్స్ తో నిర్ణయం తీసుకున్నారో కానీ, మొత్తం మీద జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.


ఏపీ అసెంబ్లీ సమావేశాలు 24వ తేదీ నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమావేశాలలో ఏపీ బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్ వస్తారా? లేదా? అనే ప్రశ్నలు వైసీపీ క్యాడర్ లోనే వినిపించాయి. జగన్ తో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పలుమార్లు జగన్ అసెంబ్లీకి రావాలని, లేకుంటే పులివెందులకు ఉప ఎన్నికల ఖాయమంటూ ప్రకటించారు. ఇదే విషయాన్ని డిప్యూటీ స్పీకర్ పదేపదే మీడియా ముందు చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా ఇటీవల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిళ కూడా జగన్ పై ఇదే రీతిలో కామెంట్స్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన మాజీ సీఎం జగన్, మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళని పక్షంలో రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మాజీ సీఎం జగన్, అసెంబ్లీకి వెళ్లాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని జగన్ నిర్ణయించారు. అంతేకాకుండా అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై జగన్ ప్రత్యేకంగా తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్లు సమాచారం.


60 రోజులు అసెంబ్లీ కి గైర్హాజరవుతే శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుందని ఇటీవల జగన్ ను ఉద్దేశించి డిప్యూటీ స్పీకర్ తో పాటు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా కామెంట్స్ చేశారు. మొత్తం మీద జగన్ అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకోవడంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Also Read: AP Intermediate: ఇంటర్ పరీక్షలకు సిద్దమవుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే సరి..

బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు..
ఏపీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. పోలీస్ అధికారులు ఇప్పటికే అసెంబ్లీ వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు కట్టుదిట్టంగా అమలుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక పాస్ లు జారీ చేయనున్నారు. అలాగే మీడియా ప్రతినిధులు, విజిటర్లు, పోలీస్ సిబ్బందికి ప్రత్యేక పాస్ లను జారీ చేసేందుకు ఇప్పటికే వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×