BigTV English

US – Ukraine : యుద్ధం మధ్యలో ఉక్రెయిన్ కు హ్యాండ్ ఇచ్చిన అమెరికా

US – Ukraine : యుద్ధం మధ్యలో ఉక్రెయిన్ కు హ్యాండ్ ఇచ్చిన అమెరికా

US – Ukraine : ఉక్రెయిన్‌-రష్యాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. ఇన్నాళ్లు ఆ దేశంపై ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి సాధించేందుకు ఉక్రెయిన్ లోని అరుదైనా, విలువైన ఖనిజాలను పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఉక్రెయిన అధ్యక్షుడు జెలెన్స్కీ, అక్కడి అధికార యంత్రాంగంపై అమెరికా అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. యుద్ధాన్ని బూచీగా చూపించి, ఇస్తావా.? చస్తావా.? అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.


ఉక్రెయిన్‌లోని కీలకమైన ఖనిజాలను పొందేందుకు జెలెన్స్కీ పై అమెరికా తరఫున రాయబారం చేస్తున్న వ్యక్తులు ఒత్తిడి తెస్తున్నారు. ఇందులో భాగంగా.. ప్రపంచం కుబేరుడు ఎలాన్ మస్క్ అంతరిక్ష ప్రయోగ సంస్థ అయిన స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉక్రెయిన్ కు అందించకుండా నిలిపివేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మధ్య జరిగిన చర్యల్లో.. యూఎస్ ప్రతిపాదనను జెలెన్స్కీ తిరస్కరించారు. దాంతో.. ఆ తర్వాతి చర్చల్లో అమెరికా-ఉక్రెయిన్ అధికారుల మధ్య స్పేస్‌ఎక్స్ సంస్థ అందిస్తున్న స్టార్‌ లింక్‌ సేవల గురించిన ప్రస్తావన వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్ కు ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో కీవ్ కు, దాని సైన్యానికి స్టార్‌లింక్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది. దీని ఆధారంగానే.. కీవ్ సేనలు క్షిపణుల్ని ప్రయోగించడం కానీ, వారి యుద్ధ విమానాల రాకపోకల్ని కానీ పరిశీలించగలుగుతున్నారు. ఇలాంటి కీలకమైన సేవల్ని నిలిపివేస్తే.. యుద్ధంలో ఉక్రెయిన్ దారుణంగా దెబ్బతినే ప్రమాదముంది. ఈనేపథ్యంలోనే అమెరికా ఉక్రెయిన్ ప్రత్యేక రాయబారి కీత్ కెల్లాగ్, జెలెన్స్కీ మధ్య జరిగిన సమావేశాల్లో ఈ సేవల ఆవశ్యకత, వాటిని అందించాలంటే ఉక్రెయిన్ అమెరికాతో చేసుకోవాల్సిన ఒప్పందాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.
కీలక ఖనిజాలపై ఒప్పందం కుదుర్చుకోకపోతే.. ఉక్రెయిన్ తన సర్వీసును వెంటనే నిలిపివేస్తుందని సమావేశంలో ఉక్రెయిన్‌కు అమెరికా అధికారులు స్పష్టం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఉక్రెయిన్‌లోని అరుదైన భూగర్భ ఖనిజాలు వెలికితీసేందుకు.. ఆ దేశంతో ట్రంప్‌ 500 బిలియన్‌ డాలర్ల మేర ఒప్పందాలు కురుర్చుకోవాలనుకుంటున్నారు. రష్యాతో యుద్ధం కారణంగా తాము చేసిన ఆర్థిక, ఆయుధ సాయానికి ప్రతిఫలంగా ఈ ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఒకవేళ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనలతో ఏకీభవిస్తే.. అరుదైన ఖనిజాలతో పాటు చమురు, గ్యాస్‌, పోర్టులు, మౌలిక సదుపాయాలు సహా ఆ దేశంలోని సగభాగం సహజ వనరులపై అమెరికా ఆధిపత్యం కోరుతోంది. వీటిలో ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీలలో కీలకమైన గ్రాఫైట్, యురేనియం, టైటానియం, లిథియం ఖనిజాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఒప్పందం ద్వారా భారీగా లాభపడాలని ట్రంప్ ఆశిస్తున్నట్లు ఆ ప్రాంత విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read : Donald Trump – India : అమెరికాకు ఇండియా భయపడాలా? ఆ దేశం సపోర్ట్ లేకపోతే ఏమవుతుంది?

ఈ ప్రతిపాదనలకు జెలెన్స్కీ తిరస్కరించిన తర్వాత.. క్రమంగా అమెరికా వైఖరిలో మార్పులు వస్తున్నాయి. ట్రంప్ రష్యా తప్పుడు సమాచారాన్ని నమ్ముతున్నారని జెలెన్స్కీ వ్యాఖ్యానించగా… జెలెన్స్కీ ఎన్నికలు లేని నియంత అంటూ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలా.. అనేక విభేధాల మధ్య.. ఉక్రెయిన్లోని ఖనిజ సంపదలో వాషింగ్టన్‌కు వాటా ఇచ్చేందుకు ఉక్రెయిన్‌ త్వరలోనే అంగీకారం తెలిపుతుంది అంటూ.. ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో.. తన అవసరాలకు వాడుకోవడంతో పాటు అత్యవసరాల్లో చేతులు వదిలేయడం అమెరికాకు అలవాటే అంటూ అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×