బనానా బర్ఫీ చేసేందుకు కావలసిన పదార్థాలు
పండిన అరటి పండ్లు – మూడు
బాదం – గుప్పెడు
చిక్కటి పాలు – పావు కప్పు
బెల్లం తురుము – ముప్పావు కప్పు
పాలపొడి – ఒక కప్పు
నెయ్యి – మూడు స్పూన్లు
కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పు
యాలకుల పొడి – అర స్పూను
బనానా బర్ఫీ రెసిపీ
⦿ బాగా పండిన అరటి పండ్లను దీనికోసం తీసుకోండి. అవి తియ్యగా ఉంటాయి. కాబట్టి బనానా బర్ఫి కూడా చాలా రుచిగా ఉంటుంది.
⦿ ఇప్పుడు ఒక గిన్నెలో బాగా పండిన అరటి పండ్లను సన్నగా తరిగి వేయండి.
⦿ చేత్తోనే ఆ అరటిపండును గుజ్జులా చేయండి. దాన్ని పక్కన పెట్టుకోండి.
⦿ ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టి బెల్లం తురుము, పాలు వేసి బాగా కలపండి.
⦿ అందులో కొబ్బరి కోరును కూడా వేసి బాగా కలపండి.
⦿ ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా అవుతున్న సమయంలో నెయ్యిని వేయండి.
⦿ ఆ తర్వాత ముందుగా నలిపి పెట్టుకున్నా అరటిపండు గుజ్జును వేసి బాగా కలుపుకోండి.
⦿ అలాగే పాలపొడిని కూడా వేసి బాగా కలపండి. అందులోనే యాలకుల పొడిని కూడా వేసి బాగా కలుపుకోండి.
⦿ ఈ మొత్తం మిశ్రమంలో దగ్గరగా అయ్యేవరకు చిన్న మంట మీద కలుపుతూ ఉండండి.
⦿ అందులో జీడిపప్పులు, బాదం పప్పులు వంటివి వేసి కలపండి.
⦿ ఇప్పుడు ఒక పాత్రకు అడుగుభాగాన నెయ్యి రాసి ఈ మొత్తం మిశ్రమాన్ని సమానంగా పరచండి.
⦿ ఒక మూడు నాలుగు గంటల పాటు అలా వదిలేయండి. తర్వాత తీస్తే అది గట్టిగా బర్ఫీ లాగా అవుతుంది.
⦿ మీకు నచ్చిన ఆకారంలో దీన్ని కట్ చేసుకొని సర్వ్ చేయండి. ఇది వారం రోజులు పాటు తాజాగా ఉంటుంది.
⦿ పిల్లలు కూడా దీన్ని బాగా ఇష్టంగా తింటారు.
⦿ ఇందులో మనము పంచదారకు బదులు బెల్లాన్ని వాడాము. కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే.
బనానా బర్ఫీ చేసేందుకు మనము బెల్లము, పాలు, కొబ్బరి, అరటిపండు, యాలకుల పొడి, నెయ్యి, పాలపొడి వంటివి వాడావు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలే చేస్తాయి. బెల్లానికి బదులు పంచదార వాడితే ఎలాంటి ఉపయోగం ఉండదు. బెల్లాన్ని వినియోగించాము కాబట్టి ఐరన్ అందుతుంది. కాబట్టి ఈ స్వీట్ ను ఇంట్లోనే చేసి పిల్లలకు తినిపించండి. ఇది కచ్చితంగా వారికి ఎంతో నచ్చుతుంది.