BigTV English

Varun Tej: రవితేజ ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన వరుణ్ తేజ్.. సక్సెస్ అయ్యేరా..?

Varun Tej: రవితేజ ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన వరుణ్ తేజ్.. సక్సెస్ అయ్యేరా..?

Varun Tej: ప్రస్తుతం వరుణ్ తేజ్ కెరీర్ సాఫీగా ఏమీ సాగడం లేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు ఈ యంగ్ హీరో. కోవిడ్ కి ముందు వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ తప్ప.. కోవిడ్ తర్వాత చేసిన ‘గని’ ‘గాండీవధారి అర్జున’ ‘ఆపరేషన్ వాలెంటైన్’ వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా డిజాస్టర్స్ అయ్యాయి. పోనీ తాను ఫ్లాపుల్లో ఉన్న విషయాన్ని గ్రహించి తప్పులు సరిచేసుకుంటున్నాడా వరుణ్ తేజ్ అంటే.. దానికి నో అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. సాధారణంగా హీరోలు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు మినిమమ్ గ్యారెంటీ అని భావించే దర్శకులతో సినిమాలు చేస్తారు. కానీ వరుణ్ ఆ బాటలో నడవట్లేదు.


కొత్త, ఫ్లాప్ డైరెక్టర్లకు వరుణ్ ఛాన్స్..

‘గని’ కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటితో చేశారు ‘గాండీవధారి అర్జున’ ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో చేసిన సినిమా. ఇక ‘ఆపరేషన్ వాలెంటైన్’ కూడా శక్తి ప్రతాప్ సింగ్ అనే నూతన దర్శకుడితో చేసిన సినిమానే. వరుణ్ తేజ్ చేసిన ‘మట్కా’ త్వరలో విడుదల కాబోతుంది. దీనికి కూడా వరుస ఫ్లాపుల్లో ఉన్న కరుణ కుమార్ దర్శకుడు. వరుణ్ తేజ్ కెరీర్ లో హిట్ సినిమాలను గమనిస్తే.. ఒక్క ‘తొలిప్రేమ’ మినహాయిస్తే, మిగిలినవన్నీ సక్సెస్ఫుల్ దర్శకులతో చేసినవే. ‘ఫిదా’ కి స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకుడు. పైగా దానికి హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) కూడా స్పెషల్ అట్రాక్షన్. ‘ఎఫ్ 2’ , ‘ఎఫ్ 3’ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)తెరకెక్కించిన సినిమా. ‘గద్దలకొండ గణేష్’ కూడా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమానే..! సో వరుణ్ సక్సెస్ఫుల్ మూవీస్ లో కూడా అతనికి క్రెడిట్ ఎక్కువ శాతం లేదు. కాబట్టి.. హిట్టు కావాలంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేయాలి. అలా కాదు చిన్న, కొత్త దర్శకులతో చేసి నేషనల్ అవార్డులు కొట్టేద్దాం అనే ఆలోచన అతనికి ఉందేమో. కానీ.. ప్రస్తుతం అతని మార్కెట్ మాత్రం చాలా బ్యాడ్ గా ఉంది. అయినా సరే వరుణ్ మాత్రం కొత్త, ఫ్లాప్ దర్శకులకి ఛాన్సులు ఇచ్చుకుంటూ పోతున్నాడు.


రవితేజ ఫ్లాప్ డైరెక్టర్ తో వరుణ్ కొత్త సినిమా..

‘మట్కా’ తర్వాత కూడా వరుణ్ ఓ ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. రవితేజతో ‘టచ్ చేసి చూడు’ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు విక్రమ్ సిరికొండ. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో అతనికి ఛాన్సులు రాలేదు. టాలీవుడ్ హీరోలు ఎవ్వరూ అతనితో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. చిరంజీవి డిజాస్టర్ మూవీ ‘భోళా శంకర్’ కి ఇతను కూడా ఒక రైటర్ గా పనిచేశాడు. మొత్తానికి ఇతను వరుణ్ తేజ్ కి కథ చెప్పి ఒప్పించుకున్నాడట. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది అని టాక్. వరుణ్ తేజ్, విక్రమ్..ల ట్రాక్ రికార్డ్ ఎలాగూ బాలేదు. ‘మైత్రి’ సంస్థ ప్రొడ్యూస్ చేసి మిడ్ రేంజ్ సినిమాలు కూడా పెద్ద హిట్లు అయిన సందర్భాలు తక్కువ. మరి ఈ ప్రాజెక్టు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. మొత్తానికైతే ఈ సినిమా కూడా డిజాస్టర్ అయిందంటే వరుణ్ కెరియర్ కంచికే అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×