YS Vijayamma Open Letter : వైఎస్ జగన్ – షర్మిళ ఆస్తుల పంపకాలు రచ్చకెక్కిన తర్వాత.. జగన్ వర్గం ఓ వైపు, షర్మిళ మరోవైపు విమర్శలు చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. ఇప్పటి వరకు మౌనంగా చూస్తూ ఉన్న వైఎస్ఆర్ కుటుంబ పెద్ద వైఎస్ విజయమ్మ మొదటి సారి స్పందించారు. ఆస్తుల పంపకం విషయమై జరుగుతున్న వరుస ఘటనలపై తన ఆలోచనలను వెల్లడిస్తూ ఏకంగా మూడు పేజీల లేటర్ ను విడుదల చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకి బాదేస్తోందన్న విజయమ్మ.. తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందోనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తుల పంపకాలు, అన్న చెల్లెలి మధ్య మనస్పర్థల విషయంలో తాను అడ్డు తగిలేందుకు ఎంత ప్రయత్నించినా జరగకూడనివి అన్నీ తన కళ్ళ ముందే జరిగిపోతున్నాయన్నారు. ఇటీవల కాలంలో వైఎస్ జగన్ కు అనుకూలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వరుస ప్రెస్ మీట్లు పెట్టి షర్మిళపై కామెంట్లు చేయగా.. వాటిపై షర్మిళ కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై స్పందించిన విజయమ్మ వైఎస్ఆర్ కుటుంబం గురించి ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారని.. తెలిసీ తెలియక మాట్లాడొద్దని సూచించారు. వారు విమర్శిస్తున్నది వైఎస్ఆర్ కుటుంబన్న సంగతి మర్చిపోవద్దని సూచించారు.
ఈ ఆస్తుల పంపకం విషయమై.. తాను స్పందించాలని అనుకోలేదని కానీ.. తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దయచేసి తన కుటుంబం, తన పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరారు. తన కుటుంబంపై నిజమైన ప్రేమ ఉంటే.. ఈ వ్యవహారంలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దని సూచించారు.
ప్రస్తుత వివాదం కొన్నాళ్లకు సర్ధుమణుగుతుందని విశ్వాసం ఉందన్న విజయమ్మ.. ఈ విషయంలో వారిని ఎవరు రెచ్చగొట్టవద్దని సూచించారు. ఇటీవల వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయి రెడ్డి, ఇతరులు అందరూ… వాళ్ళు మాట్లాడుతున్నది వైఎస్ఆర్ కుటుంబం గురించే అని మరిచిపోయారని, వారు తీస్తుంది ఆయన కుటుంబ పరువు అని స్పృహ లేకుండా అసత్యాలు మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు.. కొన్ని ఆస్తుల్ని షర్మిళ పేరుపై, మరికొన్న జగన్ పేరుపై ఉంచారని… అది ముమ్మాటికీ ఆస్తుల పంపకం కాదంటూ తేల్చేశారు. మీడియా సమావేశాల్లో షర్మిళ ఆస్తుల లిస్ట్ చదివిన వారు జగన్ ఆస్తుల లిస్ట్ చదివి ఉండాల్సిందంటూ సూచించారు.

Also Read : ఆ విషయంలో జగన్ ఒత్తిడి.. నో చెప్పిన బ్రదర్ అనిల్‌కుమార్
తన కుటుంబం, ఆస్తుల గురించి అన్నీ తెలిసిన విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు మీడియాలో అబద్దాలు మాట్లాడడం బాధ కలిగించిందంటూ.. వారి మాటల్ని ఖండించారు. తనకు, తన భర్త వైఎస్ఆర్ కు ఇద్దరు పిల్లలు సమానమేనన్న విజయమ్మ.. ఆస్తుల్లో వారిరువురికి సమాన వాటాలు ఉండాలని కోరుకున్నారు. అయితే… ఆస్తుల్ని వృద్ధి చేయడంతో జగన్ కష్టం ఉందని, కొడుకుగా అది ఆయన బాధ్యత అన్నారు. అంత మాత్రన కుటుంబ ఆస్తులు వ్యక్తిగతం అయిపోవని వ్యాఖ్యానించారు.
వైఎస్ విజయమ్మ రాసిన పూర్తి లేఖ… కింది ట్వీట్లో చదవండి.
తమ కుటుంబంలో ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ @ysjagan @realyssharmila#YSJaganMohanReddy #yssharmila #ysvijayamma #Bigtv pic.twitter.com/AmMrRiYRGv
— BIG TV Breaking News (@bigtvtelugu) October 29, 2024