Brother Anil Kumar: వైఎస్ఆర్ ఆస్తుల వివాదం తర్వాత అంతఃపురానికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్ వ్యవహారశైలి గురించి కొన్ని విషయాలు బయట పెట్టారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్. పలుమార్లు తనపై జగన్ ఒత్తిడి తెచ్చారంటూ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారాయన. ఇంతకీ ఏ విషయం, ఎందుకు? అనేదానిపై లోతుగా వెళ్దాం.
పులివెందుల అంతఃపురంలో ఏం జరిగింది.. జరుగుతుందో ఎవరికీ తెలీదు. వైఎస్ఆర్ ఆస్తుల వివాదం తర్వాత కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్ వ్యవహారశైలి తెలుసో.. తెలియకో.. ఆ పార్టీ నేతలు మాత్రం సింహం సింగిల్‌గా వస్తుందని మీడియా ముందు ఢంకా బజాయిస్తారు.
జగన్ ఎంత పిరికోడదని ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోందని టీడీపీ నేతల మాట. తన పదవి కాపాడు కునేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తారని ప్రత్యర్థి పార్టీలు చెబుతున్నాయి. జగన్‌కు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెల్లడించారు బ్రదర్ అనిల్‌కుమార్.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో కీలక విషయాలు బయట పెట్టారు బ్రదర్ అనిల్‌కుమార్. పాస్టర్‌గా తాను ఎన్నో ప్రామిస్‌లు చేస్తుంటానని, అవి నెరవేర్చేందుకు తీవ్రంగా కృషి చేయాలి.. అప్పుడే వారికి నమ్మకం కలుగుతుందన్నారు.
ALSO READ: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో మంత్రి లోకేష్ భేటీ, పెట్టుబడుల గురించి..
ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్ తనపై ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు బ్రదర్ అనిల్‌కుమార్. బీజేపీ కన్ను తనపై ఉందని, మత బోధన ఆపాలంటూ తనపై ఒత్తిడి తెచ్చాడన్నది లేటెస్ట్ న్యూస్. తాను బోధనలు ఆపకపోవడం వల్ల తనను పక్కనపెట్టారంటూ మనసులోని మాట బయటపెట్టారాయన.
మధ్యలో షర్మిల జోక్యం చేసుకుని ఎవరి వృత్తి వారిదని, ఎవరో ఏదో అన్నారని ఆపడం తగదని ఆమె కన్వీన్స్ చేసే ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఇటు జగన్-అటు షర్మిల మధ్య విభేదాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.
2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత సీఎం జగన్ ఇంటికి ఓ రోజు ప్రశాంత్ కిషోర్ వెళ్లారు. ఆ సమయంలో తెలంగాణలో పార్టీ పెట్టాలని పీకె చెప్పాడట. ఈ విషయం వెళ్లి మా అన్నను వెళ్లి అడగమని షర్మిల సలహా ఇచ్చారట.
ఈలోగా సీఎం జగన్‌తో పీకె స్వయంగా వెళ్లి తెలంగాణలో పార్టీ గురించి మాట్లాడారట. అక్కడ కేసీఆర్ ఉన్నారని, మనకు ఇబ్బంది అవుతుందని, ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయని అన్నారట. అప్పటి నుంచి అన్నా-చెల్లి మధ్య విభేదాలు మరింత తీవ్రమైనట్లు ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు బ్రదర్ అనిల్‌కుమార్. రాబోయే రోజుల్లో వైసీపీ అధినేత జగన్ గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.