OTT Movies : థియేటర్లలో హార్రర్ సినిమాలు పెద్దగా హిట్ టాక్ ను అందుకోవడం తక్కువ కానీ ఓటీటీలోకి వచ్చే ప్రతి క్రైమ్ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఈ మధ్య ఓటీటి లోకి ఒళ్ళు గగూర్పొడిఛే సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అవి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి తెలిసిందే.. వారం వారం కొన్ని భయపెట్టే సినిమాలను ఓటీటీ సంస్థలు స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తున్నాయి.. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ మూవీ ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే అది తెలుగు సినిమా కాదు. అది తమిళ్ మూవీ.. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. మరి ఆ సినిమా ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
ఎన్ కైయిల్ (Sattam En Kaiyil) అనే తమిళ్ మూవీ.. ఈ సినిమా సెప్టెంబర్ 27 న థియేటర్లలోకి వచ్చింది.. ఆ సినిమా అక్కడ సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ మూవీగా మంచి సక్సెస్ టాక్ ను అందుకుంది. అంతేకాదు భారీ వసూళ్ల ను కూడా అందుకుంది. ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకొని రాబోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం. ప్రముఖ డైరెక్టర్ చాచి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సతీష్ లీడ్ రోల్లో నటించాడు. అజయ్ రాజ్, పావెల్ నవగీతన్, మిమె గోపి, రితికా తమిళసెల్వి, విద్యా ప్రదీప్ లాంటి వాళ్లు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు..
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. సరికొత్త కథ తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గౌతమ్ అనే ఓ డ్రైవర్ బాగా పొగ మంచు కురుస్తున్న రాత్రి తన కారుతో ఓ బైకర్ ను ఢీకొడతాడు. అతడు అక్కడి కక్కడే చనిపోతాడు.. యాక్సిడెంట్ విషయం పోలీసులకు తెలియకుండా ఉండాలని ఆ శవాన్ని తన కారు డిక్కీలో దాచి పెడతాడు. బాగా తాగి తనకు తానుగా డ్రంకెన్ డ్రైవ్ కేసులో అరెస్టవుతాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు అతని కారును కూడా సీజన్ చేస్తారు. అందులో శవం ఉన్న విషయం గౌతమ్ కు తప్ప ఎవరికీ తెలియదు.. పోలీసులు అతనే బాధితుడు అని తెలుసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. పోలీసులకు దొరకకుండా గౌతమ్ చేసిన ప్రయత్నం ఏంటా అనేది స్టోరీ.. మొత్తం ఒక రాత్రి జరిగిన స్టోరీగా కాస్త సస్పెన్స్, థ్రిల్ ను జోడించి తీసిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.. అక్కడ మంచి టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఓటీటీలోకి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఓటీటీలో హిట్ అయితే ఈ సినిమాకు లాభాలు ఇంకాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి.