E-Paper
Advertisement

YS Jagan Mohan Reddy:మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబే.. జగన్ సంచలన వ్యాఖ్యలు!

YS Jagan Mohan Reddy:మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబే.. జగన్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-2027 బడ్జెట్ గణాంకాల్లోని వాస్తవాలను మోసాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నామని వైఎస్సార్‌సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ప్రజలను వంచిస్తూ ఈ బడ్జెట్‌ను రూపొందించారని ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పథకాలు బడ్జెట్‌లో ఎక్కడా కనిపించకుండా గాలికి కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

చంద్రబాబు పాలనలో పర్ఫార్మెన్స్ వీక్ గా పబ్లిసిటీ పీక్ లో ఉందని జగన్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర వృద్ధి రేటు పెరిగిపోతోందని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని అయితే వృద్ధి రేటు పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి కదా అని ప్రశ్నించారు. రాష్ట్ర తలసరి ఆదాయం పెరగకుండా గ్రోత్ రేటు పెరిగిందని చెప్పడం పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో లక్షా 19 వేల కోట్లు వస్తుందని అంచనా వేస్తే కేవలం 94 వేల కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని గణాంకాలతో వివరించారు. కాగ్ విడుదల చేసిన 23 రాష్ట్రాల సొంత ఆదాయాల పురోగతి జాబితాలో ఏపీ 22వ స్థానంలో ఉందని చంద్రబాబు పాలనలో రాష్ట్రం అట్టడుగున ఉందని విమర్శించారు.

Advertisement

రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ప్రజల సొమ్ము కాకుండా చంద్రబాబు ఆయన ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళ్తోందని జగన్ ఆరోపించారు. ‘దోచుకో దాచుకో పంచుకో’ అన్న చందంగా కూటమి ప్రభుత్వం సాగుతోందని విమర్శించారు. మరోవైపు ముఖ్యమంత్రి లోకేష్ పవన్ కల్యాణ్ విమానాలు హెలికాప్టర్లలో విహరిస్తూ గాల్లోనే తేలుతున్నారని దుయ్యబట్టారు. నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం విజయవాడ నుండి ఢిల్లీకి అక్కడి నుండి కొలంబోకు వెళ్లడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తూ టీవీలో చూడాల్సిన మ్యాచ్‌ల కోసం విదేశాలకు వెళ్లడం దారుణమని పేర్కొన్నారు.

బడ్జెట్‌లో రాష్ట్ర అప్పుల వివరాలను పూర్తిగా తొలగించడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అప్పుల వివరాలు తెలిస్తే ప్రభుత్వ అసలు రంగు బయటపడుతుందనే భయంతో చంద్రబాబు ఈ పని చేశారని విమర్శించారు. కాగ్ నివేదికలు ఆదాయం తగ్గింది అని చెబుతుంటే చంద్రబాబు మాత్రం టేప్ రికార్డర్ లాగా ఆదాయాలు పెరుగుతున్నాయని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పదేపదే అబద్ధాలు చెబుతూ గోబెల్స్ ప్రచారానికి తెరలేపారని మోసానికి అబద్ధానికి నిలువుటద్దం చంద్రబాబేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Read Also: అప్పులు చేసి ఉచితాలు ఇస్తారా? రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం సూటి ప్రశ్న

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×