E-Paper
Advertisement

Cigarettes – Vapes: సిగరెట్ కంటే వేపింగ్ సురక్షితం అనుకుంటున్నారా? నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలు ఇవే!

Cigarettes – Vapes: సిగరెట్ కంటే వేపింగ్ సురక్షితం అనుకుంటున్నారా? నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలు ఇవే!
Advertisement

Cigarettes – Vapes: ఈ మధ్యకాలంలో చాలామంది యువత స్టైల్ కోసమో లేదా సిగరెట్ మానేయడం కోసమో వేపింగ్ (ఇ – సిగరెట్) వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాగే సాధారణ సిగరెట్ తాగితే ఆరోగ్యానికి నష్టమని, వేపింగ్ వాడితే సురక్షితం అని చాలామంది  అనుకుంటున్నారు. అయితే, ఇందులో నిజమెంత? ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారు? ఈ రెండింటిలో ఏది ప్రాణాలకు ఎక్కువ ముప్పు కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సిగరెట్ ఎందుకు ప్రమాదకరం?

సాధారణ పొగాకు సిగరెట్లలో దాదాపు 5వేల కంటే ఎక్కువ ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఇందులో ఉండే నికోటిన్ చాలా వేగంగా వ్యసనంగా మారుతుంది. ఇది రక్తపోటును పెంచి, గుండెపోటు వచ్చే అవకాశాలను రెట్టింపు చేస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా.. సిగరెట్లు తాగని వారితో పోలిస్తే తాగే వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ముప్పు 30 రెట్లు ఎక్కువ ఉంటుంది. కేవలం ఊపిరితిత్తులే కాదు.. గొంతు, రొమ్ము, కోలన్ క్యాన్సర్లకు కూడా సిగరెట్ తాగడమే ప్రధాన కారణం.

Advertisement

Also Read: మీ వంటింట్లో ఈ మార్పులు చేసుకుంటే.. జిమ్‌కు వెళ్లకుండానే ఈజీగా బరువు తగ్గొచ్చు!

ఊపితిత్తులపై తీవ్ర ప్రభావం:

చాలామంది అనుకుంటున్నట్లు వేపింగ్‌ను సురక్షితం కాదు. దీనిలో ఉండే నికోటిన్ ద్రావణాన్ని వేడి చేసినప్పుడు వచ్చే ఆవిరి నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలికంగా ఇది ఆస్తమా, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులకు దారి తీస్తుంది. ఎందుకంటే, వేపింగ్‌లో నికోటిన్ కంటెంట్‌ను పెంచుతుంటారు. తద్వారా సాధారణ సిగరెట్ కంటే ఎక్కువ మోతాదులో విషపూరితమైన పదార్థాలు శరీరంలోకి చేరుతాయి. ఇది యువతలో మెదడు ఎదుగుదలను దెబ్బతీయడమే కాకుండా, గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ప్రమాదకరం.

దీర్ఘకాలిక సమస్యలకు పునాది:

Advertisement

స్మోకింగ్ వల్ల కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు.. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇది పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను తగ్గించడమే కాక, రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తుంది. కంటిలో శుక్లాలు రావడానికి, శరీరమంతా వాపులు ఏర్పడటానికి స్మోకింగ్ ముఖ్య కారణమవుతుంది. అంతేకాకుండా.. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.

గుండెను ప్రమాదంలో నెట్టేసినట్టే:

నిజం చెప్పాలంటే.. సిగరెట్ అయినా వేపింగ్ అయినా ఏదైనా సరే ఆరోగ్యానికి ప్రమాదమే. ఒకటి తక్కువ, ఇంకొకటి ఎక్కువ అని కాకుండా.. ఈ రెంటికీ దూరంగా ఉండటమే ఊపిరితిత్తులకు, గుండెకు మేలు. ముఖ్యంగా స్మోకింగ్ చేయడం వలన గుండె ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

Also Read: బరువు తగ్గాలంటే స్వీట్ కార్న్ తినాలా? శనగలు తినాలా? ఇదిగో ఫుల్ క్లారిటీ!

Related News

ఈ డ్రింక్స్ వేడి వేడిగా తాగడం వల్ల క్యాన్సర్ ప్రమాదం మూడు రెట్లు..

మాత్రను నోట్లో వేసుకుని నీళ్లు తాగాలా? లేదా నీళ్లతోపాటు మాత్ర వేసుకోవాలా? ఏది డేంజర్?

ప్లాస్టిక్ స్టూళ్ల మధ్య రంధ్రం.. డిజైన్ కోసం కాదా? కారణం తెలిస్తే పక్కా షాకవుతారు!

అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. రూ.46 లక్షల సాలరీ.. అన్నీ వదిలి ఇండియన్ ఆర్మీలోకి

బిడ్డకు ఆకలి వేసిందో లేదో ఎలా తెలుసుకోవాలి? తల్లిదండ్రులకు రెస్పాన్సివ్ ఫీడింగ్ గైడ్

మనసంతా ప్రేమ.. ఈ తేదీల్లో పుట్టినవారిని పెళ్లి చేసుకుంటే మీరు చాలా లక్కీ

పండుగ వేళ అందరిలో స్పెషల్‌గా కనిపించాలా? ఈ 5 మేకప్ లుక్స్ ట్రై చేయండి

డేటింగ్‌కు వెళ్లినప్పుడు బిల్లు ఎవరు చెల్లించాలి? 2026లో కొత్త ట్రెండ్ గురూ

Big Stories

Advertisement
×