Sharmila Vs Jagan: పులివెందుల జెడ్పీ సీటు కోల్పోయిన బాధలో వైసీపీ ఉంది. చివరకు డిపాజిట్లు కోల్పోయింది ఫ్యాన్ పార్టీ. అదే సమయంలో పుండు మీద కారం జల్లినట్టుగా ఆ పార్టీ అధినేత జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. ఆమె విసిరిన ఛాలెంజ్‌కి జగన్ రెడీ అవుతారా? రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని సరిపెట్టుకుంటారా? అసలేం జరిగింది?
బుధవారం మీడియాతో మాట్లాడిన వైసీపీ అధినేత జగన్.. సీఎం చంద్రబాబు-రాహుల్‌గాంధీ-సీఎం రేవంత్‌రెడ్డి హాట్‌లైన్‌లో టచ్‌లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఓ రేంజ్‌లో మండిపడ్డారు. హాట్‌లైన్ అంటూ జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఏకంగా జగన్‌కు ఛాలెంజ్ విసిరారు.
సీఎం చంద్రబాబుతో రాహుల్‌గాంధీ హాట్‌లైన్‌లో టచ్‌లో లేరని తాము హామీ ఇస్తున్నామని అన్నారు షర్మిల. ప్రధాని మోదీతో టచ్‌లో లేనని జగన్ బైబిల్‌పై ప్రమాణం చేస్తారా అంటూ ప్రశ్నలు సంధించారు. మీకు మాదిరిగా జనాన్ని టైర్లతో తొక్కించడం రాహుల్‌కు తెలియదని రుసరుసలాడారు.
ఆ పార్టీ నేతలు తప్పుడు పనులు చేసి అరెస్టయితే వారిని పరామర్శించడానికి జగన్ ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్ల దొంగ-గద్దె దిగు పేరుతో విజయవాడలో గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కీలక విషయాలు ప్రస్తావించారు.
ALSO READ: పులివెందుల విక్టరీపై పవన్ కామెంట్స్
జగన్ మాదిరిగా రాహుల్ బలప్రదర్శన యాత్రలు చేయలేదన్నారు. దేశ ప్రజల హక్కుల కోసం రాహుల్‌గాంధీ పోరాటం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మోదీతో పొత్తు పెట్టుకుని ఏపీని జగన్ తాకట్టు పెట్టారంటూ కుండబద్దలు కొట్టేశారు. జగన్‌కు సంస్కారం లేదని నిరూపించుకున్నారని గుర్తు చేశారు. కనీసం అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలపై మాట్లాడే ధైర్యం జగన్‌కు లేదని తేల్చేశారు.
పచ్చ కామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నారు. తెర వెనుక రాజకీయ పొత్తులు పెట్టుకోవడం జగన్‌కు అలవాటు కాబట్టే అందరూ అలాగే చేస్తారని ఆయన భావించారని దుయ్యబట్టారు. మోదీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని అధికారంలోకి వచ్చిన జగన్, ఆ తర్వాత మోదీ ముందు ఎన్నోసార్లు తలవంచారని సూటిగా ప్రశ్నించారు.
బీజేపీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు బేషరతుగా మద్దతు ఇచ్చారని, బీజేపీ నేతలకు ఎంపీ పదవులు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. దీన్ని అక్రమ పొత్తు అనాలా? లేక రాజకీయ వ్యభిచారం అనాలా? అని మండిపడ్డారు. దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి బీజేపీని ఒక మతతత్వ పార్టీగా అభివర్ణిస్తూ అన్ని వేదికలపై వ్యతిరేకించారని గుర్తుచేశారు.
ఆయన కొడుకునని చెప్పుకునే జగన్, బీజేపీకి దత్తపుత్రుడిగా మారడం సిగ్గుచేటన్నారు. మీకు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి లిక్కర్ కుంభకోణంపై సంజాయిషీ ఇవ్వాలని, నాసిరకం బ్రాండ్లకు ఎందుకు అనుమతి ఇచ్చారు? నగదు రూపంలో అమ్మకాలు ఎందుకు జరిపారో వివరించాలని డిమాండ్ చేశారు.
పులివెందులలో డిపాజిట్ కోల్పోయిన జగన్ కు, చెల్లి రూపంలో మరో ఛాలెంజ్…
నీకు దమ్ముందా అంటూ… చెల్లి విసిరిన, ఈ ఛాలెంజ్ కి రెడీనా జగనన్నా…?
PS : Dont miss the ending 😂😂#YSSharmila #YSJagan #YSRCPNeverAgain #AndhraPradesh pic.twitter.com/sG2E1MLlXp
— Kaza RajKumar (@KazaRajKumar) August 14, 2025