Film industry: సినీ ఇండస్ట్రీలో తరాలు మారేకొద్దీ ఎప్పటికప్పుడు కొత్తవారు అడుగుపెడుతూ ఉంటారు. ముఖ్యంగా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు ఇంకొకరి నుంచి ఎలాంటి కథ వస్తుందో అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రతిసారి ఇండస్ట్రీలోకి ఒక కొత్త తరం వచ్చినప్పుడు.. ఆ తరం ఇండస్ట్రీని నిలబెట్టే బాధ్యత కూడా వారిదే. ఇక కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే.. ఒకప్పుడు హిట్ కొడితే చాలు ఆ డైరెక్టర్లకి హీరోలు వరుసగా అవకాశాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు హిట్ కొట్టినా అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు కొంతమంది దర్శకులు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం.
మొదటి సినిమాతో హిట్..
ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam ), శంకర్ (Shankar ) , గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) వీళ్లంతా కూడా ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్నారు. దాంతో కోలీవుడ్ ను నిలబెట్టే బాధ్యతను లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj), నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) వంటి డైరెక్టర్లు బాధ్యతలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక డైనమిక్ దర్శకుల కొరత కోలీవుడ్లో కొరవడుతున్న సమయంలో యంగ్ డైరెక్టర్ల విప్లవం మొదలైంది. అలా అశ్వత్ మారి ముత్తు, అరుణ్ మాథేశ్వరన్ లాంటి వర్సటైల్ డైరెక్టర్ లు తెరపైకి వచ్చారు. వీరితోపాటు మరికొంతమంది కొత్త వాళ్లు కూడా ఇండస్ట్రీలోకి వచ్చి మొదటి సినిమాతోనే తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు రెండవ ప్రాజెక్ట్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు.
టాలెంట్ ఉన్నా అవకాశాలు రాని డైరెక్టర్స్..
అలాంటి వారిలో మొదటిగా చెప్పుకోవాల్సిన డైరెక్టర్ రామ్ కుమార్ బాలకృష్ణన్ (Ram kumar Balakrishnan). ఈ ఏడాది చలనచిత్ర అవార్డును అందుకున్న తమిళ్ చిత్రం ‘పార్కింగ్’. ఈ సినిమాతోనే ఈయన టాలెంట్ గుర్తించిన శింబు ఈయనకు అవకాశం ఇచ్చారు. కానీ సడన్గా మధ్యలోకి వెట్రీ రాకతో శింబు49వ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. అలాగే ‘లబ్బర్ పందు’ సినిమాతో మంచి విజయం అందుకున్న తమిళరసన్ పచ్చముత్తు కూడా నెక్స్ట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఈయన దగ్గర కథ రెడీగా ఉన్నా ధనుష్ కాల్ షీట్ల కోసం ఎదురుచూస్తున్నాడని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం ధనుష్ హీరోగా నిర్మాతగా ఫుల్ బిజీగా ఉండడంతో ఇప్పట్లో అవకాశాలు ఇచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.
హీరోలుగా మారుతున్న డైరెక్టర్స్..
వీరే కాదు నితిలన్ స్వామినాథన్ (Nithilan Swaminathan) పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. విజయ్ సేతుపతితో ‘మహారాజా’ సినిమా చేసి మంచి విజయం అందుకున్న ఈయన.. నయనతార, రజినీకాంత్ తో సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు దీనిపై ఎటువంటి అప్డేట్ లేదు. ఇక రీసెంట్గా ‘ది టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో సంచలనం సృష్టించిన అభిషన్ జీవంత్ కూడా దర్శకుడిగా అవకాశాలు లేకపోయేసరికి ఇప్పుడు హీరోగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
టాలెంట్ ను ఉపయోగించుకుంటే ప్రథమ స్థానంలో కోలీవుడ్..
ఇలా ఎంతోమంది యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఉన్నా .. వీరి టాలెంట్ ను ఉపయోగించుకోవడంలో కోలీవుడ్ హీరోలు వెనకడుగు వేస్తున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా టాలెంట్ ఉన్నా కూడా పలు కారణాలవల్ల ఈ దర్శకులంతా తమ నెక్స్ట్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఒకవేళ ఈ డైరెక్టర్ల టాలెంట్ ను సరిగ్గా వినియోగించుకుంటే మాత్రం ఖచ్చితంగా కోలీవుడ్ నష్టం నుండి బయటపడి పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకుంటుంది అనడంలో సందేహం లేదని సినీవర్గాలు కూడా చెబుతున్నాయి.