BigTV English

Dhruv Vikram: ధ్రువ్ విక్రమ్ మామూలోడు కాదయ్యో.. ఏకంగా ముగ్గురితో రొమాన్స్!

Dhruv Vikram: ధ్రువ్ విక్రమ్ మామూలోడు కాదయ్యో.. ఏకంగా ముగ్గురితో రొమాన్స్!

Dhruv Vikram: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న విక్రమ్ (Vikram ) కుమారుడు ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram) గురించి ఇప్పుడు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నటుడుగానే కాకుండా గాయకుడిగా, గీతా రచయితగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. 2019లో వచ్చిన ‘ఆదిత్య వర్మ’ అనే చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన ఈయన.. 2022లో తన తండ్రితో కలిసి ‘మహాన్’ అనే సినిమాలో నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక 2022 నుండి హీరోగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ధ్రువ్ విక్రమ్ తన సినిమాలలోనే కాదు ఇతర సినిమాలలో కూడా పాటలు పాడుతూ తన స్వరాన్ని అందరికీ వినిపిస్తున్నారు.


ముగ్గురితో రొమాన్స్..

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ధ్రువ్ విక్రమ్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇది విన్న చాలామంది మామూలోడు కాదయ్యో.. ఏకంగా ముగ్గురితో రొమాన్స్ ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..


అసలు విషయం ఏమిటంటే?

అసలు విషయంలోకి వెళ్తే.. గత ఏడాది హిట్ అయిన ‘కిల్’ చిత్రాన్ని తెలుగు, తమిళ్ భాషలలో రీమేక్ చేయడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రమేష్ వర్మ (Ramesh Varma) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళ వెర్షన్ కోసం ధ్రువ్ విక్రమ్ వ హీరోగా ఎంపికైనట్లు సమాచారం. ఇందులోనే ధ్రువ్ విక్రమ్ కి జంటగా ఏకంగా ముగ్గురు హీరోయిన్లను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారిలో కాయాదు లోహర్ (Kayadu lohar), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), కేతిక శర్మ (Kethika sharma) ను తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఒక యంగ్ హీరోకి ఏకంగా ముగ్గురు హీరోయిన్లు అంటే మామూలు విషయం కాదు అని, ధ్రువ్ విక్రమ్ రేంజ్ ఈ సినిమాతో మరింత పెరిగిపోతుందని కూడా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

ధ్రువ్ వ్యక్తిగత జీవితం..

1997 సెప్టెంబర్ 23న చెన్నైలో ప్రముఖ నటుడు విక్రమ్, ఆయన భార్య శైలజా దంపతులకు జన్మించారు. ధ్రువ్ విక్రమ్ కి అక్షిత అనే అక్క కూడా ఉంది. ఈమె రాజకీయ నాయకుడు ఎమ్. కరుణానిధి ముని మనవడైన మనో రంజితను వివాహం చేసుకున్నారు. ఇక ధ్రువ్ విక్రమ్ తాతయ్య వినోద్ రాజ్ అందరికీ సుపరిచితులే. ఈయన కూడా కొన్ని పనులు చిత్రాలలో నటించి నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ధ్రువ్ విక్రమ్ ఇండస్ట్రీలోకి రాకముందే లీస్ట్రాస్ బర్గ్ థియేటర్, ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకున్నారు. ఇది న్యూయార్క్ యూనివర్సిటీ కావడం గమనార్హం.

ధ్రువ్ విక్రమ్ అందుకున్న అవార్డ్స్..

ధ్రువ్ విక్రమ్ అందుకున్న అవార్డ్స్ విషయానికి వస్తే .. 2020వ సంవత్సరంలో ఆదిత్య వర్మ అనే చిత్రానికి గానూ ఉత్తమ తొలి నటుడు విభాగంలో 13వ ఆనంద వికటన్ సినిమా అవార్డు అందుకున్నారు. అలాగే తమిళంలో జీ సినీ అవార్డు కూడా అందుకున్న ఈయన.. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కి నామినేట్ అవ్వడం జరిగింది.

also read: Film industry: హిట్ కొట్టినా.. ఈ డైరెక్టర్స్ ని పట్టించుకోవడం లేదా..కారణం?

Related News

War 2 Collections : ‘కూలీ’ కన్నా ‘వార్ 2’ కలెక్షన్స్ అంత తక్కువా.. వీకెండ్ కలిసివస్తుందా..?

Himaja: హిమజా లెమన్ టాస్క్.. నీళ్లు కిందపడకుండా ఆ నిమ్మకాయను పైకి తీయగలరా?

Coolie Collections : బాక్సాఫీస్ వద్ద ‘కూలీ ‘ జోరు.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే..?

Ram Charan: త్వరలో రంగస్థలం 2.. ఆ టార్గెట్ దిశగా చెర్రీ.. నిజమైతే బన్నీ తర్వాత స్థానం!

OG Movie : ‘ఓజీ ‘ పార్ట్ 2 ఉందా..? సుజిత్ ను నమ్మొచ్చా..?

Ghattamaneni: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న ఘట్టమనేని వారసురాలు..అత్త కల నెరవేరుస్తుందా?

Big Stories

×