YS Sharmila: మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితుడైన అవినాశ్ రెడ్డికి వైసీపీ టికెట్ కేటాయించడంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఓ హంతకుడికి సీఎం జగన్ టికెట్ ఎలా ఇస్తారని పశ్నించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడపలోని పర్యటించారు. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో సీబీఐ అవినాశ్ ను నిందితుడిగి తేల్చిందని అలాంటి నిందితుడికి జగన్ టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. తన బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలన్నారు. ప్రజలు తమకు ఎంతో ముఖ్యమైన ఓటు సాయంతో హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వారికి బుద్ది చెప్పాలన్నారు.
ముస్లింలకు ఎన్నో వాగ్దానాలు చేసిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ముస్లింల పక్షాన నిలబడేదని వెల్లడించారు. కడప ఎంపీ ఒక్కసారి కూడా కడప స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదని.. అయితే తాను అలా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేశారు.
“ముస్లిం మైనార్టీల కోసం 4 శాతం రిజర్వేషన్లు కల్పించి వారికి సమాజంలో సమున్నత స్థానాన్ని అందించారు దివంగత మహానేత వైఎస్సార్.. ముస్లింల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటిది బీజేపీ అంటేనే గిట్టని వైఎస్సార్ కు బీజేపీకి బానిస అయిన జగన్ వారసుడు ఎలా అవుతారు.
ముస్లింలకు ఎన్నో వాగ్ధానాలు చేసిన జగన్ వారిని దారుణంగా మోసం చేశారు. ఇమామ్ లకు రూ.15 వేలు వేతనం, ముస్లిం బ్యాంక్, చనిపోతే రూ.5 లక్షల బీమా వంటి ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే వాటిని విస్మరించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరు ముస్లింల పక్షాన లేరు.. కాంగ్రెస్ మాత్రమే ముస్లింలకు భరోసా ఇస్తుంది. వారి సంక్షేమం కోరుకుంటుంది. అందుకే ఆలోచించండి ధర్మం వైపు నిలబడండి.. కడప ఎంపీగా పోటీచేస్తున్నాను.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా.. వైఎస్సార్ లాగా సేవ చేస్తానని మాటిస్తున్నాను” అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.
ముస్లిం మైనార్టీల కోసం 4 శాతం రిజర్వేషన్లు కల్పించి వారికి సమాజంలో సమున్నత స్థానాన్ని అందించారు దివంగత మహానేత వైఎస్సార్..ముస్లింల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటిది బీజేపీ అంటేనే గిట్టని వైఎస్సార్ కు బీజేపీకి బానిస అయిన జగన్… pic.twitter.com/q2duRpQcTE
— YS Sharmila (@realyssharmila) April 6, 2024