BigTV English

Attack On NIA Team: బెంగాల్‌లో ఎన్‌ఐఏ బృందంపై ఇటుకలతో దాడి.. స్పందించిన దీదీ..

Attack On NIA Team: బెంగాల్‌లో ఎన్‌ఐఏ బృందంపై ఇటుకలతో దాడి.. స్పందించిన దీదీ..
Attack On NIA Team In West Bengal
Attack On NIA Team In West Bengal

Attack On NIA Team In West Bengal (Latest Today news in India): పశ్చిమ బెంగాల్‌ తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని భూపతినగర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బృందంపై ఇటుకలతో దాడి చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో 2022లో జరిగిన పేలుడు కేసును విచారించేందుకు ఎన్‌ఐఏ బృందం అక్కడికి చేరుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి తిరుగుప్రయాణంలో వారిపై స్థానికులు దాడి చేశారు.


ఎన్‌ఐఏ బృందం ప్రయాణించిన కారు విండ్‌స్క్రీన్‌ను పాడు చేయడంతో పాటు ఇటుకలు విసిరినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో స్థానికులు వాహనాన్ని ఘెరావ్ చేసి రాళ్లు రువ్వడంతో ఈ ఘటన జరిగింది. ఎన్‌ఐఏ టీమ్‌లో ఒక అధికారి గాయపడ్డారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

కాగా ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ముందుగా ఎన్ఐఏ అధికారులే దాడి చేశారని.. ఆ తరువాతే మహిళలు దాడి చేశారని పేర్కొన్నారు. ఎన్ఎఐ, సీబీఐ బీజేపీకి సోదరులని.. ఈడీ, ఐటీ ఆ పార్టీకి ఫండింగ్ బాక్సులని దీదీ విమర్శించారు.


ఈ ఉదయం ఎన్‌ఐఏ అధికారుల బృందం ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా వాహనంపై దాడి జరిగినట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేంద్ర పోలీసు బలగాల భారీ బృందం భూపతినగర్‌కు చేరుకుందని, అరెస్టయిన ఇద్దరు వ్యక్తులతో పాటు ఎన్‌ఐఏ బృందం అక్కడ ఉందని పోలీసులు తెలిపారు.

డిసెంబర్ 3, 2022న, భూపతినగర్‌లో ఒక ఇంటిలో పేలుడు సంభవించి ముగ్గురు వ్యక్తులు మరణించారు. పోలీసులు ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించారు. ఈ పేలుడు ఘటనకు సంబంధించి గత నెలలో ఎన్ఐఏ ఎనిమిది మంది తృణమూల్ కాంగ్రెస్ నేతలను విచారణకు పిలిచింది.

Also Read: Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితులతో సంబంధం ఉన్న బీజేపీ కార్యకర్త అరెస్ట్..

ఈ చర్య వెనుక ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ఉందని టీఎంసీ నేత కునాల్ ఘోష్ ఆరోపించారు. పూర్బా మేదినీపూర్ జిల్లాకు చెందిన టీఎంసీ నేతల జాబితాను బీజేపీ ఎన్‌ఐఎకు అందజేసిందని, వారిని అరెస్టు చేయాలని యోచిస్తున్నట్లు ఘోష్ పేర్కొన్నారు.

ఇటీవల బెంగాల్‌లో ఈడీ అధికారులపై దాడి జరిగింది. సందేశ్‌ఖాలీ కేసులో అరెస్ట్ అయిన షాజహాన్ ఇంటిపై రైడ్ చేయడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×