Jabardast Comedian : జీవితం ఎప్పుడు ఎవరి జీవితాన్ని తల క్రిందులు చేస్తుంది అనేది చెప్పడం కష్టం.. ఈరోజు మూడు పువ్వులు ఆరు కాయలు లాగా మారిన జీవితం రేపు పువ్వులమ్ముకోడానికి కూడా పనికిరాదు అన్న సామెత చాలామందికి తెలిసే ఉంటుంది. అంటే ఎప్పుడు జీవితం ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు అదృష్టం ఎలా ఉంటే అలా మారుతుంది. బండ్లు ఓడలవచ్చు ఓడలు బండ్లవచ్చు ఇలా ఈరోజు సాఫీగా సాగిన జీవితం రేపు రోడ్ల మీదకు రా వచ్చిన రావచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నా మన సందేహం వస్తుంది కదూ.. అవును అందుకు కారణం కూడా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కమెడియన్ ఒకప్పుడు బుల్లితెరపై పలు షోలలో మెరుస్తూ తన సత్తాని చాటింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తూ రీల్స్ లేటెస్ట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ వస్తుంది. మొన్నటి వరకు బాగానే ఉన్నాయి మా పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ప్రస్తుతం రోడ్లమీద కొబ్బరి బోండాలు అమ్ముకుంటుందని సమాచారం.. ఇంతకీ ఆ నటి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆమె మరెవ్వరో కాదు.. రీతూ చౌదరి.. జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో హైపర్ ఆది సహా పలువురి టీమ్‌లో హల్ చల్ చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది రీతూ చౌదరి. ఈ షోలో గ్లామర్‌తో పాటు తన కామెడీ టైమింగ్‌తో పంచ్‌లు కూడా విసురుతూ శెభాష్ అనిపించుకుంది.. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. జబర్దస్త్ పాటు ఎన్నో సినిమాలు ఎన్నో శాలలో నాకు కనిపించి తన నటనతో అందరిని మెప్పించింది. ఇక సోషల్ మీడియా ద్వారా తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చిన ఈ అమ్మడు గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ స్కాన్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే . ఆమె గురించి కొన్ని నిజాలు బయటపడడంతో ప్రస్తుతం ఆమె జీవితం తలకిందులైందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఆ స్కాం గురించి బయటపడటంతో అసలు రీతు చౌదరికి పెళ్లయిందా అనే అనుమానాలు కూడా చాలామందికి వచ్చాయి. చివరికి తనకు పెళ్లయిందని తన భర్తకు దూరంగా ఉందని ఒప్పేసుకుంది. ఇండస్ట్రీలో పైకి ఎదుగుతున్న దశలో తన స్క్రీన్ పేరును రీతూ చౌదరిగా మార్చుకుంది. ఆమె తండ్రి పేరు కూడా వనం శేఖర్.. ఈ స్కాం గురించి బయటపడిన తర్వాత ఓ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చిన ఈమె తనకు పెళ్లయిందని తన అసలు పేరు వనం దివ్య అని తానే స్వయంగా బయట పెట్టింది. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉందని రీతూ బాంబు పేల్చింది. శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ సహా పలు వ్యాపారాలు చేస్తాడని తెలుసని.. అయితే తాను షూటింగ్స్, ఇతర పనుల్లో బిజీగా ఉండటంతో భర్తతో గడిపే సమయం కూడా ఉండేది కాదని తెలిపింది.. ఇక ప్రస్తుతం ఆమె రోడ్డుమీద కొబ్బరి బొండాలు అమ్ముతుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది..రోడ్డుపై కొబ్బరి బొండాలు నరుకుతూ కనిపించడంతో రీతూ చౌదరికి ఏమైందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు..