RGV investigation : గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పద పోస్టులు పెట్టిన కేసులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఒంగోలు పోలసులు విచారిస్తున్నారు. ఫిబ్రవరి 7 న ఉదయం ఒంగోలు పోలీసులు ఎదుట హజరైన ఆర్టీవీ ని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 9 గంటల పాటు విచారణ సాగగా..చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. ఆర్జీీని అరెస్ట్ చేస్తారని కొంతసేపు, విచారణ మరోరోజుకు పొడిగిస్తారని మరికొంత సేపు ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. చివరకు రాత్రి 10 గంటల సమయంలో రామ్ గోపాల్ వర్మను పోలీసులు విడిచిపెట్టారు.
విడుదలైన వెంటనే మరో ఝలక్!
ఒంగోలు పోలీసుల ఎదుట హజరై సుదీర్ఘ విచారణ తర్వాత బయటకు వచ్చిన ఆర్జీవీకి మరో ఝలక్ తగిలింది. అప్పుడే విచారణ ముగిసింది అనుకుంటుండగా.. గుంటూరు పోలీసులు అక్కడే మరో నోటీసు అందజేశారు. గతంలో ఆయన తీసిన “అమ్మ రాజ్యంలో కడప రెడ్డు” అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో చూపించిన సీన్లు, వాడిన మాటలు సహా సినిమా పేరు సైతం కొన్ని వర్గాలను కించపరిచేదిగా ఉందంటూ గుంటూరు సీఐడీ పోలీసుల దగ్గర కేసు నమోదైంది. ఆ కేసు విచారణలో భాగంగా ఈనెల 10న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందించారు.
కేసు వివరాలేంటి..
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉండగా.. అప్పటి ప్రతిపక్షం టీడీపీ, జనసేనా పార్టీలను, ఆయా పార్టీల అధినాయకుల్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు, సినిమాలు చేశారనే ఆరోపణలున్నాయి. వైసీపీ కి అనుకూలం సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు సైతం పెట్టినట్లు పలు కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల విషయమై వరుసగా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు అందజేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, అతని తనయుడు నారా లోకేష్, జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ లను అవమానించేలా ఓ మార్ఫింగ్ ఫోట్ సోషల్ మీడియాలో పెట్టారనే కారణంగా.. ఒంగోలు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ కేసులో విచారణకు హాజరుకావాలని గతేడాది నవంబర్ 19 విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అప్పటి నుంచి వాయిదా వేస్తూ వస్తున్నారు. తాజాగా.. ఒంగోలు పోలీసుల ఫిబ్రవరి 7న కచ్చితంగా హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పడంతో.. రామ్ గోపాల్ వర్మ ఒంగోలు పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం హాజరయ్యారు.
Also Read : పోలీస్ స్టేషన్ మెట్లెక్కనున్న ఆర్జీవీ.. అరెస్ట్ తప్పదా? విచారణతో ముగింపా?