E-Paper
Advertisement

YS Sharmila: పవన్ కళ్యాణ్‌.. రెచ్చగొట్టొద్దు.. వైఎస్ షర్మిల ఆగ్రహం

YS Sharmila: పవన్ కళ్యాణ్‌.. రెచ్చగొట్టొద్దు.. వైఎస్ షర్మిల ఆగ్రహం
Advertisement

YS Sharmila: వైఎస్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, అవి రాష్ట్రాల మధ్య అపోహలు, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన మాటలు ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగవని షర్మిలా రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్నదమ్ముల్లాంటి సంబంధాలు కలిగిన రాష్ట్రాలని గుర్తుచేసిన షర్మిలా, రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ ప్రాంతీయ విభేదాలు రేపేలా వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రజల మనసుల్లో అనవసరమైన భయాలు, అపోహలు పెంచేలా ఉన్నాయన్నారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

కోనసీమ ప్రాంతంలో కొబ్బరి తోటలు నష్టపోవడానికి అసలు కారణం ఉప్పు నీటి ముప్పే అని షర్మిలా స్పష్టం చేశారు. శంకరగుప్తం డ్రెయిన్‌కు ఇరువైపులా గట్లు నిర్మించడంలో, డ్రెడ్జింగ్ పనులు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని ఆమె ఆరోపించారు. సముద్రం నుంచి పైకి వస్తున్న ఉప్పు నీటితో లక్షల సంఖ్యలో కొబ్బరి చెట్లు ఎండిపోతూ కూలిపోతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు సరైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

ఈ భారీ పర్యావరణ, వ్యవసాయ సమస్యను పక్కనపెట్టి, దాన్ని దిష్టి, మూఢనమ్మకాలతో ముడిపెట్టడం ప్రజలను కించపరచడమేనని షర్మిలా అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా మూఢనమ్మకాలను ప్రోత్సహించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు, శాస్త్రీయ ఆలోచనలకు తీవ్ర విరుద్ధమన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను విడిచిపెట్టి, వాటిని అపోహలపై నెట్టడం అన్యాయమని పేర్కొన్నారు.

Advertisement

కూటమి ప్రభుత్వానికి నిజంగా కోనసీమ కొబ్బరి రైతులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉప్పు నీటి ముప్పును అడ్డుకునే చర్యలు చేపట్టాలని షర్మిలా డిమాండ్ చేశారు. డ్రెయిన్‌ల బలోపేతం, గట్ల నిర్మాణం, సముద్రపు ఉప్పు నీటిని నియంత్రించే ప్రాజెక్టులను తక్షణమే ప్రారంభించాలన్నారు. అలాగే కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న నష్టాలకు వెంటనే పరిష్కారం చూపాలని, పంట నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

కోనసీమ ప్రాంతంలో లక్షలాది కుటుంబాలు కొబ్బరి సాగుపై ఆధారపడి జీవిస్తున్నాయని, ఈ వ్యవసాయం దెబ్బతింటే వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టకుండా రాజకీయ వ్యాఖ్యలతో కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. వెంటనే రూ.3,500 కోట్ల నిధులు కేటాయించి, అత్యవసరంగా పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని షర్మిలా కోరారు.

రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే బాధ్యత ప్రభుత్వానిదేనని, తప్పులను దిష్టి, అపోహల పేరిట దాటవేయడం ప్రజలకు న్యాయం కాదన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రైతుల కష్టాలను మరింత చిన్నబుచ్చేలా ఉన్నాయని, ఇది ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని దెబ్బతీయడం తప్ప ఇంకేమీ కాదన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయకుండా ఉప ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టుగా వ్యవహరించాలని షర్మిలా సూచించారు. ప్రజల సమస్యలపై రాజకీయాలు చేయకుండా, వారిని ఆదుకునే దిశగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని కోరారు. కోనసీమ కొబ్బరి రైతులకు తక్షణ న్యాయం చేయాలని, ఉప్పు నీటి ముప్పును శాశ్వతంగా నివారించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆమె స్పష్టంగా డిమాండ్ చేశారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×