BigTV English

YS Sharmila: ‘రాహుల్‌ పీఎం అయితే.. తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే’

YS Sharmila: ‘రాహుల్‌ పీఎం అయితే.. తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే’

YS Sharmila latest news today


YS Sharmila latest news today(Andhra politics news): ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర ప్రజల హక్కు అని కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. తిరుపతిలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో ప్రధాని మోదీ ఒక్కటైనా నిలబెట్టుకున్నారా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తుందని.. రాహుల్‌ గాంధీ పీఎం అయ్యాక తొలి సంతకం దీనిపైనే చేస్తారని షర్మిల వెల్లడించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో ప్రధాని మోదీ ఒక్కటైనా నిలబెట్టుకున్నారా? అని ప్రశ్నించారు.


ఏపీ లోప్రత్యేక హోదా కోం పోరాడే వాళ్లు కావాలా..? తాకట్టు పెట్టే వాళ్లు కావాలో రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలని షర్మిల అన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చిత్తశుద్దితో ఉందన్నారు. అందుకే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోమాలో ఉన్నా.. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదా కోసం చేరానని పేర్కొన్నారు.

Read More: రాజకీయ కక్ష కోసం వ్యవస్థలను వాడుతున్నారు.. గవర్నర్ కు చంద్రబాబు లేఖ..

తిరుపతిలోని ఇదే మైదానంలో ప్రధాని మోదీ అనేక హామీలు ఇచ్చారని షర్మిల అన్నారు. అద్బుతమైన రాజధాని కడతామన్నారన్నారు. రాష్ట్రాన్ని హార్డ్ వేర్ హబ్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రత్యేక హోదా ఇస్తాం.. పోలవరం కట్టిస్తామని  ఎన్నో పకడ్బాలు పలికారన్నారు. వాటిలో ఒక్కటైనా నిలబెట్టుకున్నారా..? అని ప్రశ్నించారు. కేంద్రం పదేళ్లుగా రాష్ట్రాన్ని మోసం చేస్తూందని దుయ్యబట్టారు. పక్కనున్న రాష్ట్రాలు అభివృద్దిలో దూసుకెళ్తున్నాయన్నారు. దక్షినాది రాష్ట్రాల్లో మెట్రో రైలు లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఏపీనేనని షర్మిల వివరించారు.

 

Tags

Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×