BigTV English

Chandrababu: రాజకీయ కక్ష కోసం వ్యవస్థలను వాడుతున్నారు.. గవర్నర్ కు చంద్రబాబు లేఖ..

Chandrababu: రాజకీయ కక్ష కోసం వ్యవస్థలను వాడుతున్నారు.. గవర్నర్ కు చంద్రబాబు లేఖ..

Chandra babu naidu latest news


Chandra babu naidu latest news(Andhra pradesh political news today): తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు బనాయిస్తోందని గవర్నర్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు లేఖ రాశారు. ప్రభుత్వ వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వాడుకొని టీడీపీ నేతలను వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి అక్రమ అరెస్టుల గురించి ప్రస్తావిస్తూ ఏపీఎస్డీఆర్ఐ దుర్వినియోగంపై చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ విభాగాల ద్వారా టీడీపీ నేతలు, కార్యకర్తలపై సీఎం జగన్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఎస్డీఆర్ఐ ద్వరా తెలుగుదేశం నేతలను బెదిరించి ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.


ప్రతిపక్ష పార్టీలను వెధించేందుకు ఆయుధంగా ప్రభుత్వ వాడుకుంటోందని చంద్రబాబు లేఖలోపేర్కొన్నారు. అికార పార్టీకి విధేయుడైన చికల రాజేశ్వర్ రెడ్డిని ఆ సంస్థ కు ప్రత్యేక కమీషనర్ గా నియమించుకొని టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.

Read More: పేద పిల్లల కోసమే విద్యా దీవెన.. పామర్రులో సీఎం జగన్..

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును సైతం ఏపీఎస్టీఆర్ఐ ద్వరా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని చంద్రబాబు అన్నారు. మళ్లీ ఇప్పుడు ప్రత్తిపాటి కుమారుడు శరత్ ను కేసులో ఇరికించి అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శరత్ ఆ సంస్థలో కేవలం 68 రోజులు మాత్రమే అడిషనల్ డైరెక్టర్ గా విధులు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. కేవలం టీడీపీ నేతలను వేధించడమే ఏపీఎస్డీఆర్ఐ పనా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం సీఐడీని జేబు సంస్థగా మార్చుకుని ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ నేతలను కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. ఏపీఎస్డీఆర్ఐ వేధింపులు భరించలేక పలువురు వ్యాపార వేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని ఆయన గుర్తు చేశారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×