BigTV English

Ambani Wedding Pop Singer: అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో పాప్‌ సింగర్, రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా..

Ambani Wedding Pop Singer: అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో పాప్‌ సింగర్, రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా..

Pop Singer rihanna in Ambani's pre-wedding


Pop Singer Remuneration in Ambani’s pre-wedding(Celebrity news today): ప్రపంచ కుబేరుల జాబితాలో తనకంటూ ఓ మార్క్‌ని క్రియేట్ చేసుకుని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఒకరు. అంబానీ చిన్నకొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ఫ్రీ వెడ్డింగ్‌ సంబరాలు అంబరాన్నంటాయి. ఇప్పటికే వీరి వేడుకలకు దేశంలోని ప్రముఖులు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరుగనుంది. ఇక్కడే ఈ వేడుకలను జరుపుకోవడానికి మెయిన్‌ రీజన్. అనంత్‌ అంబానీ గుజరాత్‌లోనే పుట్టాడని.. అందుకే తన పెళ్లి వేడుకలను ఇక్కడ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ వేడుకలో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది పాప్‌ సింగర్‌ రిహన్న..

ప్రపంచ పాప్‌ సింగర్‌లో రిహన్న ఒకరు. ఈ రిహన్న ఇప్పుడు జాంనగర్‌లో ఉంది. ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌లో స్పెషల్‌ షో చేయనున్నారు. నాలుగు గంటల పాటు తన సంగీతంతో అతిథులను మంత్రముగ్థులను చేయనున్నారు. ఇందుకోసం ఆమె అక్షరాల రూ. 85 కోట్లను అంబానీ నుండి అందుకుంటున్నారు. అంతేకాకుండా ఆమె విదేశాల నుండి రావడానికి ఆమె కోసం ఓ ప్రత్యేక విమానం.. ఆ విమానంలో మూడు ట్రక్కుల్లో వచ్చిన ఎక్విప్‌మెంట్‌, మూడురోజుల పాటు ఆమె జాంనగర్‌లో ఉండటం కోసం ఆమె టీంకి ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అందుకే వీరందరి కోసం ఇంతలా ఖర్చు చేయబోతున్నారట మన అంబానీ. శ్రోతలను ఆహ్లాదపరిచేందుకు ఆమె సైతం అన్ని విధాలుగా తన ఏర్పాట్లను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.


Read More: అయ్యబాబోయ్, అంబానీ కొడుకు పెళ్లికి అన్నికోట్లా.?

రిహన్న పాటలకు ప్రపంచమంతా ఉర్రూతలూగుతూ చిందులు వేసింది. 2020-21లో ఎంతోమంది భారతీయులు ఆమె టాలెంట్ గురించి తెలుసుకున్నారు. వాస్తవానికి, రిహన్న ఆ సమయంలో భారతదేశంలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుగా X (అప్పటి ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో రిహానాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా సరే కొంతమంది ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా ఆమె అప్పుడే వెలుగులోకి రావడంతో అందరి నోట రిహన్న పాట అన్నట్లుగా మారింది.

ఇక ఈ వేడుకలకు దేశంలోని నలుమూలల నుండి ప్రముఖుల రాకతో జామ్‌నగర్ అంతా సందడి వాతావరణం నెలకొంది. టీమీండియా మాజీ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ దంపతులు, క్రికెటర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, అఫ్గాన్ క్రికెటర్ రషీద్‌ఖాన్, విండీస్ క్రికెటర్ బ్రావో, జహీర్‌ఖాన్ దంపతులు, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్​ జామ్‌నగర్‌కు ఇప్పటికే చేరుకున్నారు. అలాగే డీఎల్ఎఫ్‌ సీఈఓ కుశాల్‌ పాల్‌సింగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో పనిచేసే ముఖ్య అధికారులు సైతం ఇక్కడికి చేరుకున్నారు. ఏదేమైనా దేశంలోని ప్రముఖులంతా ఒక్కచోట సందడి చేయడంతో కెమెరాల చూపంతా గుజరాత్‌ వైపే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×