E-Paper
Advertisement

అమ్మోరు సాక్షిగా రూ.లక్ష లంచం.. పోశమ్మ గుడి వద్ద ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు!

అమ్మోరు సాక్షిగా రూ.లక్ష లంచం.. పోశమ్మ గుడి వద్ద ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు!
Advertisement

ACB Bribe: అమ్మోరు సాక్షిగా లంచం తీసుకున్న ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​ గా పట్టుకున్నారు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ అరెస్టులు సచివాలయంలోని పోశమ్మ అమ్మవారి ఆలయం వద్ద జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి.

సీఎం రిలీఫ్​ ఫండ్..

సెక్రటేరియట్​ లో ఆనందేశి రాఘవేందర్​ ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగి. బషీర్​ బాగ్ లోని పరిశ్రమ భవన్​ లో ఉన్న టీఎస్​డీసీ ఆఫీస్​ లో మేడి వినోద్ సీనియర్​ అసిస్టెంట్​ గా పని చేస్తున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం ఉంది. కొంతకాలం క్రితం తీవ్ర అనారోగ్యం బారిన పడ్డ ఓ వ్యక్తి పేదరికం కారణంగా తనకు నగదును మంజూరు చేయాలని సీఎం రిలీఫ్​ ఫండ్​ కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో అతనికి రెండు లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ చెక్కును ఇవ్వటానికి రాఘవేందర్​, వినోద్​ కలిసి లక్ష రూపాయలు లంచంగా డిమాండ్​ చేశారు. డబ్బు ముట్టజెబితేనే చెక్కు ఇస్తామని చెప్పారు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు.

Advertisement

Also read: జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!

పోశమ్మ మందిరం వద్ద..

ఈ క్రమంలో రాఘవేందర్​, వినోద్​ లను పట్టుకోవటానికి ఏసీబీ అధికారులు వలపన్నారు. దాని ప్రకారం గురువారం సచివాలయంలోని పోశమ్మ మందిరం వద్ద వినోద్​ బాధితుని నుంచి లక్ష రూపాయలు తీసుకుని రాఘవేందర్​ చేతికి ఇవ్వగానే దాడి చేసి రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుకున్నారు. వారి నుంచి లంచంగా తీసుకున్న లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్​ చేశారు. ఆ తరువాత నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి చెంచల్​ గూడ జైలుకు రిమాండ్​ చేశారు.

Advertisement

Also read: బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

Tags

Related News

తెలంగాణ SIR 2026 ఓటర్ల జాబితా పరిశీలన.. నాయకులపై టీపీసీసీ చీఫ్ ఫైర్..!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. కారులో భార్యను హత్య చేసిన భర్త!

సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్?

జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!

నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. క్షణాల్లో ప్రమాదం..!

ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Big Stories

Advertisement
×