BigTV English

YSR Congress Party: 45 ఏళ్ల అనుభవంలో కనిపించిన డొల్లతనం: వైసీపీ విమర్శలు

YSR Congress Party: 45 ఏళ్ల అనుభవంలో కనిపించిన డొల్లతనం: వైసీపీ విమర్శలు

Fire Accident: అనకాపల్లిలో అగ్ని ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీలోని ఓ రియాక్టర్ పేలుడుతో సుమారు 15 మంది కార్మికులు మరణించారు. దాదాపు 50 మంది వరకు గాయాలపాలయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాలోకేశ్ సహా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


ఈ ఘటనపై వైసీపీ ఘాటుగా రియాక్ట్ అయింది. ప్రమాదం గురించి కనీసం సమాచారాన్ని కూడా తీసుకోలేని అలసత్వంతో టీడీపీ ప్రభుత్వం ఉన్నదని విమర్శించింది. ఇది పాలనలో చంద్రబాబు నాయుడి బేలాతనానికి నిదర్శనం అని.. 45 ఏళ్ల అనుభవంలో కనిపించిన డొల్లతనం అని ఫైర్ అయింది.

అచ్యుతాపురం అగ్నిప్రమాదంపై ప్రభుత్వం అలసత్వానికి నిదర్శనమని మండిపడింది. ఘటన జరిగిన సుమారు 5 గంటల తర్వాత సచివాలయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రెస్ మీట్ పెట్టారని వివరించింది. ముగ్గురు మాత్రమే చనిపోయారని, 25 మందికి మాత్రమే గాయాలు అయ్యాయని ఘటనను చిన్నదిగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించింది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నదనే క్లారిటీ లేని కామెంట్ చేశారని వివరించింది. ఆ స్థాయిలో ప్రమాదం జరిగినా ప్రభుత్వానికి సమాచారం లేకపోవడం దారుణం అని ట్వీట్ చేసింది. అదే ప్రెస్ మీట్‌లో జగన్ ప్రభుత్వంపై పనికిమాలిన ఆరోపణలు చేయడం మరీ దారుణమని మండిపడింది.


Also Read: Minister Tummala: రుణమాఫీ ఆంక్షలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి తుమ్మల..

30 కిలోమీటర్ల దూరంలోని విశాఖకు కాకుండా అనకాపల్లిలోని ఆస్పత్రికి బాధితులను తరలించడం.. క్రైసిస్ మేనేజ్‌మెంట్‌లోని డొల్లతనాన్ని వెల్లడిస్తున్నదని వైసీపీ ఫైర్ అయింది. తమను విశాఖపట్నం తీసుకెళ్లాలని బాధితులు వేడుకున్నారని, అనకాపల్లిలో ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపించారని బాధితులు అధికారుల ముందు గగ్గోలు పెడుతున్నారని పేర్కొంది.

Related News

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Big Stories

×