BigTV English

Sheikh Hasina:షేక్ హసీనాను మాకు అప్పగించండి.. భారత్‌కు ఆ పార్టీ డిమాండ్

Sheikh Hasina:షేక్ హసీనాను మాకు అప్పగించండి.. భారత్‌కు ఆ పార్టీ డిమాండ్

Sheikh Haina: షేక్ హసీనా ప్రస్తుతం భారత దేశంలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత్‌ను కోరింది. హసీనాపై బంగ్లాలో హత్యా అభియోగాలు సహా పలు కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ క్రమంలోనే ఆమెను తమ దేశానికి అప్పగించాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత్ ను డిమాండ్ చేసింది.


షేక్ హసీనాకు పొరుగు దేశం ఆశ్రయం కల్పించడం విచారకరం. ఆమె బంగ్లా విజయాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. హసీనాను న్యాయబద్ధంగా బంగ్లాదేశ్‌కు అప్పగించండి. పలు కేసుల్లో ఆమెను విచారించేందుకు మా దేశ ప్రజలు, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆమెను విచారణ ఎదుర్కోనివ్వండి అని బీఎన్‌పీ పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రల్ ఇస్లాం పేర్కొన్నారు.

హసీనాపై 31 కేసులు:
విద్యార్థులు చేపట్టిన రిజర్వేషన్ల ఆందోళనలో బంగ్లాదేశ్ అట్టుడికిపోయింది. ఈ అల్లర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలోనే మృతుల కుటుంబాలు పోలీసులను ఆశ్రయించారు. వారి కుటుంబ సభ్యుల మరణాలకు హసీనా కారణమని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై, ఆమె అనుచరులపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. హసీనాపై ఇప్పటి వరకు 31 కేసు నమోదయ్యాయి. ఇందులో 26 హత్య అభియోగాలు కూడా ఉన్నాయి. మారణహోమానికి కారకులయ్యారనే ఆరోపణలపై నాలుగు కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్‌కు సంబంధించిన మరో కేసు కూడా ఆమెకు నమోదైంది.


Also Read: ఉద్రిక్తతల మధ్య మోదీ ఉక్రెయిన్ పర్యటన

బంగ్లాదేశ్ అల్లర్ల కారణంగా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన హసీనా కుటుంబ సభ్యులు, ఆమె కుమారుడు సాజీత్ వాజెద్, కుమార్తె సైమా వాజెద్ సోదరి షేక్ రెహానాను హత్య కేసుల్లో నిందితులుగా చేర్చారు. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ  నేషనలిస్ట్ పార్టీ భారత్ ను హసీనాను తమ దేవానికి అప్పగించాలని డిమాండ్ చేసింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×