Botsa vs Pawan: ఏపీలో రాజకీయాలు ప్రతిపక్ష హోదా చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ విషయంలో అధికార పక్షం తెగేసి చెబుతోంది. వైసీపీ ఏ మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వమని తేల్చిచెప్పింది. అయినా వైసీపీ మాత్రం ఇదే అంశంపై కూటమి సర్కార్‌ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయంలో పవన్ మాటలపై వైసీపీ ఎలా రియాక్ట్ అయ్యింది? దానికి గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేద్దాం.
జనసేన వర్సెస్ వైసీపీ
రాజకీయాల్లో రాణించాలంటే కనీసం అనుభవం ఉండాలని తలపడిన సీనియర్లు అప్పుడప్పుడు చెబుతారు. తేడా వస్తే అడ్డంగా ప్రత్యర్థులకు దొరుకుతామని అంటుంటారు. ఇదీ ముమ్మాటికీ నిజమే. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని అంటుంటారు. అసలే సోషల్ మీడియా ప్రబలంగా ఉన్న ఈ రోజుల్లో, ప్రత్యర్థులకు దొరికితే ఓ ఆట ఆడుకోవడం ఖాయం. తాజాగా ప్రతిపక్ష హోదాపై పవన్ చేసిన కామెంట్స్ కౌంటరిచ్చారు. జనసేనను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది వైసీపీ.
జనసేన మాట
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత మీడియా పాయింట్‌లో మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వైసీపీ డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష హోదాపై నోరు విప్పారు. మరో ఐదేళ్ల వరకు వైసీపీ ప్రతిపక్ష హోదా రాదని తేల్చేశారు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా వారికి ఆ హోదా దక్కేదన్నారు. ప్రజా తీర్పును గౌరవించి వైసీపీ సభ్యులు సభకు రావాలన్నారు. రాజ్యాంగం ప్రకారం ఆ విధానం ఇవ్వలేమన్నారు. అందుకే కుదరదని తేల్చిచెప్పారాయన.
ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది వైసీపీ. దీనిపై మంగళవారం నోరు విప్పారు మండలిలో వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. అసెంబ్లీలో అధికార పార్టీకి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీలు ఒకవైపు ఉన్నాయన్నారు. వైసీపీ మరో వైపు ఉందన్నారు.
ALSO READ: వల్లభనేని వంశీ విచారణ, అదుర్స్ డైలాగ్స్ రిపీట్
జనసేనను ఇరకాటంలో పెట్టేలా బొత్స మాటలు
పవన్ చెప్పినట్టుగా వైసీపీ కంటే జనసేనకు ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. ఆయనే ప్రతిపక్షనేతగా ఉండొచ్చు కదా అని మెలిక పెట్టారు. ఈ విషయంలో మాకు అగడానికి హక్కు ఉండదన్నారు. పవన్ కల్యాణ్ ప్రతిపక్ష నేతగా ఉంటే మా పార్టీ ఆ విషయాన్ని ప్రస్తావించేది కాదన్నారు. ఎందుకంటే వైసీపీ కంటే జనసేనకు ఎక్కువ సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. సీట్ల ప్రకారం హోదా ఇవ్వాలనేది మన రాజ్యంగంలో ఉందన్నారు.
జర్మనీలో పార్టీకి పోలైన ఓట్ల ప్రకారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. బొత్స వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ నేరుగా కౌంటర్ ఇవ్వలేదు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్, 15 ఏళ్లపాటు కూటమి అధికారంలో ఉంటుందని మరోసారి స్టేట్‌మెంట్ ఇచ్చారు. గతంలో ఆ తరహా ప్రకటన అసెంబ్లీలో చేశారాయన.
వైసీపీ ఫ్యూచర్ ప్లానేంటి?
గత ప్రభుత్వం 90 శాతం మంది సభ్యులను ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం. తనను, సీఎం చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేసినా, ప్రజల కోసం తాము నిలబడ్డామన్నారు. మాలో మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించి 15 ఏళ్లు అధికారంలో ఉండడం ఖాయమని తేల్చేశారాయన. దీంతో వైసీపీ వేసిన ఎత్తులు చిత్తయ్యాయి. ఈ నేపథ్యంలో వైసీపీ కొత్త స్కెచ్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.