Ex Pak women’s team captain: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ కధ ముగిసింది. ఈ టోర్నీలో న్యూజిలాండ్, భారత్ తో జరిగిన రెండు మ్యాచ్లలో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా టోర్నీలోకి అడుగుపెట్టి.. పేలవ ప్రదర్శనతో టోర్నీ నుండి నిష్క్రమించింది. పాకిస్తాన్ జట్టుకు స్పెషల్ కోచ్ లను పెట్టే విలువైన సూచనలు ఇప్పించినా.. జట్టును మాత్రం విజయాలు వరించలేకపోయాయి. దీంతో సొంత ఆటగాళ్లపై సొంత అభిమానులతో పాటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ {Ex Pak women’s team captain} సనా మీర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ ఆటగాళ్ల ఎంపిక సరిగ్గా లేదని.. ఈ జట్టుకు భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని సారధిగా నియమించినా పెద్దగా ప్రయోజనం ఉండదని కీలక వ్యాఖ్యలు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్లను చూసినప్పుడే తనకి పాకిస్తాన్ జట్టు ఓడిపోయినట్లు అర్థమయిందని చెప్పుకొచ్చింది. ఈ 15 మంది ఆటగాళ్లను మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి అప్పగించిన ఏమీ చేయలేడని ఎద్దేవా చేసింది.
“దుబాయ్ లోని పిచ్ లపై కనీసం ఒక మ్యాచ్ అయిన ఆడాల్సి ఉంటుందని ఎంపిక చేసిన సెలెక్టర్లకు తెలుసు. మరి జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ ఒక్కరినే ఎందుకు తీసుకున్నారు. ఇద్దరు పార్ట్ టైం స్పిన్నర్లను ఎలా తీసుకున్నారు. అబ్రార్ వన్డేలకు కొత్త. గత ఐదారు నెలల ముందు జట్టులోకి వచ్చాడు. అతనిపై ఎలా నమ్మకం పెట్టుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లలో ఆడిన ఆటగాళ్లను ఎందుకు తొలగించారు.
జట్టు ఎంపిక సరిగ్గా జరగలేదు. పరిస్థితులకు తగ్గట్లు జట్టును ఎంపిక చేయడంలో పాకిస్తాన్ సెలెక్టర్లు విఫలం అయ్యారు”. అని సనా విమర్శించింది. ఇక భారత్ తో పాటు న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్తాన్.. సెమీస్ కి చేరకుండా ఇంటి దారి పట్టింది. బంగ్లాదేశ్ తో నామమాత్రపు చివరి లీగ్ మ్యాచ్ ఆడబోతోంది పాకిస్తాన్. ఇక {Ex Pak women’s team captain} సనా మీర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ధోనీ గురించి మరోసారి చర్చ జరుగుతుంది. ధోని ఎంత గొప్ప కెప్టెనో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.
2007 టీ-20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇలా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్గా మహేంద్రసింగ్ ధోనీ పేరు భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. ఎలాంటి పరిస్థితిలోనైనా సహనం కోల్పోకపోవడం ధోనీ నైజం. ఆటగాళ్లంతా విఫలం అయినా సరే.. అండగా ఉంటూ వారిలోని అత్యుత్తమ ప్రతిభను బయటకు తీసుకురావడంలో ధోని నేర్పరి అన్న సంగతి తెలిసిందే. ఇక ధోని తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెప్టెన్సీలో కూడా టీమిండియా అద్భుతంగా దూసుకుపోతుంది.
☠️☠️☠️☠️#MSDhoni #Pakistan pic.twitter.com/riJk8hqDAE
— Comedyculture.in (@ComedycultureIn) February 25, 2025