BigTV English

Kodali Nani : కొడాలి నానికి సీరియస్? ముంబై తరలింపు?

Kodali Nani : కొడాలి నానికి సీరియస్? ముంబై తరలింపు?

Kodali Nani : కొడాలి నానికి ఏమైంది? మొదట్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అన్నారు. ఆ తర్వాత హార్ట్ ఇష్యూ అని చెప్పారు. గుండెలో 4 వాల్వ్‌లు ఉంటే అందులోు 3 నాళాలు పూడుకుపోయాయని తెలిపారు. హైదరాబాద్ AIG హాస్పిటల్‌లో కొన్నిరోజులుగా చికిత్స పొందుతున్నారు. కొడాలి ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆయనకు సీరియస్ ప్రాబ్లమా?


రెడ్‌బుక్ vs హెల్త్ బుక్

టీడీపీ శ్రేణులు మాత్రం రెడ్ బుక్ భయంతో కొడాలి డ్రామాలు ఆడుతున్నారని అంటున్నారు. స్వయంగా మంత్రి నారా లోకేశ్ సైతం రెడ్ బుక్ గుర్తుకొచ్చి కొందరికి హార్ట్ ప్రాబ్లమ్‌లు వస్తున్నాయంటూ పబ్లిక్‌గానే సెటైర్లు వేశారు. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ తదితరులను లోపలేశారు. గత ప్రభుత్వ హయాంలో ఓవరాక్షన్ చేసిన వైసీపీ నాయకులందరితో ఊచలు లెక్కబెట్టించడం ఖాయమని లోకేశ్ కన్ఫామ్‌గా చెబుతున్నారు. వంశీ, పోసాని తర్వాత నెక్ట్స్ జైలు కెళ్లేది కొడాలినే అంటూ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో.. కొడాలి నాని అనారోగ్యంతో హాస్పిటల్‌లో అడ్మిట్ కావడంతో ఆయన హెల్త్ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది.


కొడాలి రాతి గుండెకు ఏమైంది?

అయితే, రెడ్ బుక్ ఎఫెక్ట్ వల్లనో, హెల్త్ ప్రాబ్లమ్‌తోనో కారణం ఏదైనా.. కొడాలి నాని హెల్త్ కండీషన్ కాస్త సీరియస్‌గానే ఉందట. నానికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని బయట విపరీతంగా ప్రచారం జరుగుతోంది. రెడ్‌బుక్కే ఆయన గుండెపోటుకు కారణమని టీడీపీ అంటోంది. అయితే, స్ట్రోక్ రాలేదని వైసీపీ చెబుతోంది. ఆరోగ్యం బాగాలేకపోతే హైదరాబాద్, AIG హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారని.. డాక్టర్లు టెస్టులు అన్నీ చేస్తే గుండెలో మూడు వాల్వ్‌లు మూసుకుపోయాయని చెప్పారట. ప్రాబ్లమ్ క్రిటికలే అని.. మెరుగైన ట్రీట్‌మెంట్ అవసరమని తెలుస్తోంది. చికిత్స కోసం నానిని ఏకంగా ముంబైకి తీసుకెళ్తారనేది లేటెస్ట్ అప్‌డేట్. స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేస్తారట.

హైదరాబాద్‌లోకే ప్రస్తుతం టాప్ హాస్పిటిల్ AIG. అక్కడ లేని ట్రీట్‌మెంట్.. ముంబైలో ఉంటుందా? అంటే ఉంటుందట. కొడాలిని మెరుగైన చికిత్స కోసం ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసం కుటుంబసభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read : వైసీపీలో అది మిస్సింగ్.. జగనన్న జర చూడన్నా..

డాక్టర్ పాండా. ఇండియాలోకే ఫేమస్ హార్ట్ స్పెషలిస్ట్. ఆయనే కొడాలి నానికి హార్ట్ సర్జరీ చేయబోతున్నారని తెలుస్తోంది. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్‌కి బైపాస్ సర్జరీ చేశారు ఆయన. రఘురామకృష్ణంరాజు. కొనకళ్ల నారాయణకు బైపాస్ చేసింది కూడా డాక్టర్ పాండానే. అందుకే, ఆ టాప్ డాక్టర్ దగ్గరే కొడాలి నాని సైతం సర్జరీ చేయించుకుంటారట. ఆయన కోసం కొడాలిని ముంబై షిఫ్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వారంలోనే నాని గుండెకు బైపాస్ సర్జరీ జరిగనుందని చెబుతున్నారు.

కొడాలి తిరిగొచ్చాక.. అరెస్టేనా?

కొడాలి నాని త్వరగా కోలుకోవాలని వైసీపీతో పాటు టీడీపీ నేతలూ కోరుకుంటున్నారు. తమ పార్టీ ఫైర్‌బ్రాండ్ లీడర్ క్షేమంగా ఉండాలని వైసీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నారు. సర్జరీ చేయించుకున్నంత మాత్రానా కొడాలిని వదిలిపెట్టేది లేదని.. ఎంత త్వరగా తిరిగివస్తే.. అంత తొందరగా నానిని అరెస్ట్ చేసి లోపలేయాలని టీడీపీ వర్గాలు పంతంతో ఉన్నాయి. గతంలో అచ్చెన్నాయుడుకి సర్జరీ అయ్యాక కూడా జైల్లో పెట్టిన ఘటనను గుర్తు చేస్తున్నారు. కొడాలికి కూడా అదే గతి పడుతుందని పోల్చి చెబుతున్నారు. చూడాలి మరి..

Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×