Delhi Bed box Murder: ఒక ఫ్లాట్‌లోని బెడ్‌బాక్స్‌లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం కనిపించిన ఘటన దేశ రాజధాని ఢిల్లీని వణికించింది. వివేక్ విహార్‌లోని సత్యం ఎన్‌క్లేవ్‌లో ఒక ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తున్నట్లు తమకు ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్నారు.
లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా గదికి తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు. అయితే రూం బయట రక్తం మరకలు కనిపించడంతో అనుమానంతో తలుపు తెరిచి తనిఖీ చేయగా బెడ్ బాక్స్ కింద మహిళ మృతదేహం లభించిందని పోలీసులు తెలిపారు.
చనిసోయిన మహిళను లూథియానాకు చెందిన అంజు అకా అంజలిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్‌కు తరటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి భర్త ఆశిష్, అతని స్నేహితుడు అభయ్ కుమార్, ఇంటి యజమాని వివేకానంద మిశ్రా ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. భర్త అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న అంజు ప్రశ్నించడం వల్ల గొడవ జరిగిందట. దీంతో అంజు పుట్టింటికి వెళ్లిపోయింది. తనను ఢిల్లీ రప్పించిన ఆశిష్.. స్నేహితులతో కలిసి హత్య చేసి మృతదేహాన్ని బెడ్ బాక్స్ లోపల దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. గది దుర్వాసన రావడంతో అసలు కథ బయట పడిందని వెల్లడించారు. నిందితులు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.