E-Paper
Advertisement

Malladi Vishnu Comments: తిరుమలలో అన్ని అపచారాలే.. హిందువులు అంటే లెక్కలేదా? కూటమి పై వైసీపీ నేత ఫైర్

Malladi Vishnu Comments: తిరుమలలో అన్ని అపచారాలే.. హిందువులు అంటే లెక్కలేదా? కూటమి పై వైసీపీ నేత ఫైర్
Advertisement

Malladi Vishnu Comments: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ధార్మిక సంస్థలపై.. వరుసగా దాడులు జరుగుతున్నాయని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆరోపణలు చేశారు. హిందువుల మనోభావాలతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ధర్మ పరిరక్షణ విషయంలో పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. హిందువులు అంటే ప్రభుత్వానికి నిజంగా ఏమైనా గౌరవం ఉందా? అని ప్రశ్నించారు.

వైసీపీపై బురద చల్లేందుకు హిందూ దేవుళ్లను, దేవస్థానాలను రాజకీయ ఆయుధాలుగా మార్చారని మల్లాది విష్ణు ఆరోపించారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టను దిగజార్చేలా లడ్డు, పరకామణి పేరుతో తప్పుడు ప్రచారాలు చేశారని విమర్శించారు. కోట్లాది హిందువుల ఆరాధ్య దైవ క్షేత్రం అయిన తిరుమలపై ఇలాంటి దుష్ప్రచారం చేయడం అత్యంత బాధాకరమని అన్నారు.

Advertisement

టీటీడీ గోశాలలో గోవులు చనిపోయే పరిస్థితులను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని మల్లాది విష్ణు ఆరోపించారు. గోమాత పరిరక్షణ పేరుతో పాలన సాగిస్తున్నామని చెప్పే ప్రభుత్వం, వాస్తవంగా గోవుల సంరక్షణలో పూర్తిగా విఫలమైందని అన్నారు. గోశాలల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, నిర్లక్ష్యమే గోవుల మరణాలకు కారణమని ఆయన పేర్కొన్నారు.

టీటీడీ లడ్డు అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను.. తక్షణమే రద్దు చేయాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. లడ్డు అంశాన్ని రాజకీయంగా మలచవద్దని స్వయంగా సుప్రీంకోర్టే స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. అయినా కూడా ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పదేపదే తెరపైకి తెచ్చి, హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

రెండో అతిపెద్ద దేవస్థానంగా గుర్తింపు పొందిన టీటీడీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ఘటనపై కూడా మల్లాది విష్ణు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద దేవస్థానంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఏంటని ప్రశ్నించారు. కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందా? అని విమర్శించారు. ప్రభుత్వానికి అసలు ఏమైనా బాధ్యత ఉందా అని నిలదీశారు.

ధర్మం పట్ల ప్రభుత్వానికి నిజంగా గౌరవం ఉందా లేదా అన్నది.. ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని మల్లాది విష్ణు అన్నారు. దేవాలయాల పరిరక్షణ, అర్చకుల సంక్షేమం వంటి అంశాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. దేవదాయ శాఖ అసలు ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ఆలయాల నిర్వహణలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో దేవదాయ శాఖ పూర్తిగా విఫలమైందని అన్నారు.

పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఒక అర్చకుడు రోడ్డెక్కి దీక్షకు దిగాల్సిన పరిస్థితిని.. ప్రభుత్వం తీసుకొచ్చిందని మల్లాది విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. అర్చకుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో వైసీపీని విమర్శించే అర్హత కూటమి పార్టీల నేతలకు లేదని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేసామని, టీటీడీ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. ధర్మాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం కూటమి ప్రభుత్వ లక్ష్యంగా మారిందని విమర్శించారు.

Also Read: బాలయ్య సినిమా అప్పుడు 20 పొట్టేళ్లు నరికితే కనపడలేదా?: మాజీ మంత్రి తానేటి వనిత ఫైర్

హిందూ దేవాలయాలు, సంప్రదాయాలు, విశ్వాసాలను కాపాడటంలో వైసీపీ ఎప్పుడూ.. ముందు వరుసలో ఉంటుందని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ధర్మ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే.. ప్రజలు తగిన సమయంలో సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×