BigTV English

Jagan: బీఆర్ఎస్ బాటలో వైసీపీ.. ప్లాన్ మామూలుగా లేదు, కూటమితో ఇక కబడ్డీ?

Jagan: బీఆర్ఎస్ బాటలో వైసీపీ.. ప్లాన్ మామూలుగా లేదు, కూటమితో ఇక కబడ్డీ?

Jagan: వచ్చే ఏడాది జగన్ ఆలోచన ఎలా ఉండబోతోంది? దూకుడు‌గా వెళ్లే ఛాన్స్ లేదా? జగన్‌ను కూటమి సర్కార్ అష్టదిగ్భంధం చేసిందా? ఈ నేపథ్యంలో అధినేత ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తున్నారు?  ద్వితీయ శ్రేణి నాయకుల మెడపై కేసులు వేలాడుతున్నాయి. కొందరిపై ఈడీ కేసులు, మరి కొందరిపై సీఐడీ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మూడు అడుగులు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది ఆ పార్టీ వ్యవహారశైలి.


కూటమి అష్టదిగ్భంధం నుంచి జగన్ బయటపడే అవకాశాలు కనిపించలేదు. కార్యకర్తలు, నేతలతో అధినేత జగన్ మీటింగులు తప్పితే, ఎలాంటి యాక్టివిటీ జరగలేదు. దీనివల్ల కేడర్ నిరాశలో కూరుకుపోయింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. గతంలో సోషల్ మీడియా ద్వారా విపరీతంగా రెచ్చిపోయారు కార్యకర్తలు.

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలపై విపరీతంగా పోస్టులు పెట్టారు. ఇంటాబయటా విమర్శలు రావడంతో అటువైపు దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సోషల్‌‌ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేసింది.. చేస్తోంది కూడా.


మరికొందర్ని అరెస్ట్ చేసే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు డీలా పడిపోయారు. దీన్ని నుంచి బయట పడేందుకు కొత్త స్కెచ్ వేశారట జగన్. సోషల్ మీడియా లేకుంటే కష్టమనే భావనకు జగన్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో బీఆర్ఎస్ మాదిరిగా విదేశాల నుంచి సోషల్‌మీడియాను యాక్టివ్ చేయాలనే ఆలోచనకు వచ్చారట.

ALSO READ: వార్నీ, ఈ కుర్చీల గోలేంది సామి.. ఎవరు మొదలుపెట్టారు?

బీఆర్ఎస్ తన సోషల్ మీడియా కార్యకలాపాలను దుబాయ్ నుంచి నడిపిస్తోందని తెలంగాణలో అధికార పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై తెలంగాణలో పెద్ద చర్చ జరిగింది. ఇదే ఫార్ములాను జగన్ కూడా ఇంప్లిమెంట్ చేసే పనిలో పడ్డారు. అమెరికా, యూకె, ఆస్ట్రేలియా వైసీపీ మద్దతుదారులున్నారు. వారి ద్వారా సోషల్ మీడియాను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తోందని సమాచారం.

రెండునెలల కిందట వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ భార్గవ్‌రెడ్డి అమెరికా, యూకెల్లో పర్యటించారు. అక్కడి వారిలో సమావేశాలు నిర్వహించారు. వైసీపీ బలమైన మద్దతుదారులకు ఆయా పగ్గాలు అప్పగించినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి వారంతా యాక్టివ్ కాగానే, పార్టీ దూకుడుగా వెళ్లాలని ఆలోచన చేస్తున్నారట జగన్.

అధినేత జగన్ ప్లాన్ మామూలుగా లేదని అంటున్నారు కొందరు నాయకులు. ద్వితీయ శ్రేణి నేతలు లేకపోయినా ప్లాన్ ప్రకారం జరిగితే కూటమి సర్కార్‌ని జగన్ ఓ ఆటాడుకోవడం ఖాయమనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో కొనసాగుతోంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×