America under-19 cricket: 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు మలేషియా వేదికగా అండర్ 19 టీ-20 ఉమెన్స్ వరల్డ్ కప్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో అండర్ 19 ప్రపంచకప్ టి-20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన అమెరికా జట్టుకు భారత సంతతికి చెందిన తెలుగు అమ్మాయి కొలన్ అనిక రెడ్డి కెప్టెన్ గా వ్యవహరించబోతోంది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో మరో ముగ్గురు తెలుగు సంతతికి చెందిన వారు కూడా ఉన్నారు.
Also Read: sameer rizvi fastest double century: ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ బ్యాటర్ సంచలన డబుల్ సెంచరీ
పడిగ్యాల చేతన రెడ్డి, ఇమ్మడి శాన్వి, నషా వల్లభనేని కూడా అమెరికా జట్టు తరపున బరిలోకి దిగబోతున్నారు. ఈ జట్టుకి కెప్టెన్ గా ఎంపికైన అనిక రెడ్డి మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీకి చెందిన ముప్పు సత్తిరెడ్డి కూతురు కొలన్ మంజుల – అల్లుడు సురేష్ రెడ్డి దంపతుల కూతురు. సురేష్ రెడ్డి – మంజుల 12 ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. మంజుల వైద్యురాలు కాగా.. సురేష్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
తమ కూతురికి 8 ఏళ్ల వయసు నుంచి క్రికెట్ పై ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు.. ఆమెకి క్రికెట్ లో శిక్షణ ఇప్పించారు. 19 ఏళ్ల అనిక అమెరికాలో 10వ తరగతి పూర్తి చేసి.. రెండేళ్ల క్రితమే అండర్ 19 టీ-20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు జట్టు వైస్ కెప్టెన్ గా ఎంపికైంది. టీమ్ లో వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ గా అనిక రానిస్తుంది. ఇక ఇప్పుడు అమెరికా అండర్ 19 క్రికెట్ జట్టుకి కెప్టెన్ గా ఎంపికైంది. ఇక ఇమ్మడి శాన్వి కుటుంబం సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండికి చెందింది. వీరి కుటుంబం 1997లో అమెరికాలోని కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యింది.
శాన్వి తండ్రి రమేష్ ప్రస్తుతం సిస్కో సిస్టమ్స్ లో కన్సల్టెంట్ గా పని చేస్తున్నారు. ఇక జనవరి 18 నుండి ఫిబ్రవరి 2 వ తేదీ వరకు జరగబోయే మలేషియాలోని నాలుగు వేదికల్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఎ లో భారత్, వెస్టిండీస్, శ్రీలంక మలేషియా జట్లు ఉండగా.. గ్రూప్ బి లో అమెరికా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్. ఇక గ్రూప్ సి లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, సమోవా, నైజీరియా. గ్రూప్ డి లో బంగ్లాదేశ్, నేపాల్, స్కాట్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి.
Also Read: Rohit Sharma – Ravi Shastri: రోహిత్ శర్మ బ్యాటింగ్ పై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
* అమెరికా జట్టు: కొలన్ అనిక రెడ్డి ( కెప్టెన్ ), అదితిబా చుదసమ ( వైస్ కెప్టెన్), చేతన ప్రసాద్, ఇసాని మహేష్, పగిడియాల చేతన రెడ్డి, దిశ ఢీంగ్రా, లేఖ హనుమంత్ శెట్టి, నిఖర్ పింకు దోషి, మహి మాధవన్, పూజా గణేష్, పూజా షా, రీతూ ప్రియాసింగ్, సుహాని, ఇమ్మడి శాన్వీ, నషా వల్లభనేని.