Kadapa Politics: కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మరోసారి గందరగోళంగా మారింది. మేయర్ సురేష్ బాబు- ఎమ్మెల్యే మాధవీరెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నస్థాయికి చేరింది. దీంతో టీడీపీ-వైసీపీ కార్పొరేటర్లు మధ్య నినాదాలతో సమావేశం రసాభాసగా మారింది.
కడప కార్పొరేషన్‌లో మేయర్ సురేష్‌బాబు- టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి మధ్య కుర్చీల వ్యవహారం తారాస్థాయికి చేరింది. ఇప్పటివరకు మూడుసార్లు సర్వ సభ్య సమావేశం జరిగింది. మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతోంది. సోమవారం జరిగిన కార్పొరేషన్ సమావేశంలో అదే తంతు జరిగింది. కుర్చీ లేకపోవడంతో ఎమ్మెల్యే మాధవీరెడ్డి నిలబడి ఉండిపోయారు. దీంతో సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
ఇటు వైసీపీ.. అటు టీడీపీ సభ్యుల పోటా పోటీ నినాదాలతో సమావేశంలో గందరగోళం పరిస్థితి నెలకొంది. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు ఇరువర్గాల సభ్యులు. ఈ క్రమంలో కార్పొరేటర్ల మధ్య తోపులాటకు దారితీసింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఏడుగురు కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేయర్.
సమావేశానికి ఆటంకం కలిగిస్తున్నారంటూ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు మేయర్. వైసీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేయాలంటూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వైసీపీ పాలనలో మేయర్ కుడి, ఎడమ వైపు ఎమ్మెల్యేలను కూర్చొబెట్టుకున్నారని, ఇప్పుడు ఎమ్మెల్యేకు కుర్చీ లేకపోవడం ఏంటని మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవీరెడ్డి.
ALSO READ: జగన్‌కు పీడకలను మిగిల్చిన 2024.. మరి 2025 అయిన కలిసొస్తుందా ..?
ఎమ్మెల్యేకు కచ్చితంగా కుర్చీ వేయాల్సిందేనని టీడీపీ సభ్యులు పట్టుపట్టారు. దీంతో మేయర్‌ను ఇరు పార్టీల సభ్యులు చుట్టుముట్టారు. సమావేశంలో కుర్చీ లేకపోవడంతో మేయర్‌పై మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవీరెడ్డి. మహిళ ఎమ్మెల్యేను అవమానపరుస్తున్నారని రుసరుసలాడారు.
మహిళలను అవమానిస్తే మీ నాయకుడు సంతోషపడవచ్చన్నారు. తన కుర్చీని కార్పొరేటర్లు లాగేస్తారని మేయర్ భయపడుతున్నారని ఆరోపించారు. అందుకే మేయర్ కుర్చీలాట ఆడుతున్నారని మండిపడ్డారు. అంతకముందు కడప నగరంలో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే మాధవీరెడ్డి మధ్య ఫ్లెక్సీవార్ జరిగింది.
మేయర్ సురేష్‌బాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో తీవ్ర కలకలం రేపింది. మేయర్ భార్య జయశ్రీ అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారంటూ ఫ్లెక్సీల్లో ప్రస్తావించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా ఉండేలా పోలీసులు అలర్ట్ అయ్యారు. దాదాపు 150 మంది పోలీసులు కడప సిటీలో మొహరించారు. 30 యాక్ట్‌ను ఇంప్లిమెంట్ చేశారు.
కడప కార్పొరేషన్‌లో పాలకపక్షానికి చెందిన సభ్యులు టీడీపీ వైపు వెళ్లిపోవడాన్ని వైసీపీ అధిష్టానం సీరియన్‌గా తీసుకుంది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డిపై జగన్ కాసింత అసహనం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ చేయిదాటిపోతే వైసీపీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుందని మందలించినట్టు వార్తలొచ్చాయి. అక్కడి నుంచి మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా వివాదం కంటిన్యూ అవుతోంది.
ఎమ్మెల్యేకు కుర్చీ వేయకుంటే సమావేశం నుంచి వెళ్లిపోతారని భావించి మేయర్ ఈ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. అయినా సరే సమావేశంలో నిలబడే టీడీపీ ఎమ్మెల్యే పోరాటం చేస్తున్నారు. మొత్తానికి ఇరు పార్టీలు కడప కార్పొరేషన్‌ను కీలకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారానికి ఇప్పుడు చెక్ పడుతుందో చూడాలి.
కడప నగరంలో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే
ఇవాళ కార్పొరేషన్ సమావేశం సందర్భంగా ఫ్లెక్సీ వార్
మేయర్ సురేష్ బాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కలకలం
మహిళలంటే చిన్న చూపా అంటూ బ్యానర్లు
మహిళా ఎమ్మెల్యేకు మేయర్ గౌరవం ఇవ్వలేదంటూ ఫ్లెక్సీ
మేయర్ భార్య జయశ్రీ అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారంటూ… pic.twitter.com/lv7cK8kshE
— BIG TV Breaking News (@bigtvtelugu) December 23, 2024