Allu Arjun Case: తెలుగు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన అంశం సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్(Allu Arjun)నిర్లక్ష్యంగా ప్రవర్తించడమే ఈ సంఘటనకు కారణం అని నెటిజెన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మరోవైపు అసెంబ్లీ వేదికగా శనివారం రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కూడా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ పై విచారణ వ్యక్తం చేశారు. అయితే అదే రోజు సాయంత్రమే ప్రెస్ మీట్ నిర్వహించిన అల్లు అర్జున్.. తనపై కొంతమంది కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తన క్యారెక్టర్ ను బ్యాండ్ చేసేందుకు చూస్తున్నారని, 20 సంవత్సరాలుగా కాపాడుకుంటున్న గౌరవాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే అసహనం వ్యక్తం చేశారు.
ముందే హెచ్చరించిన పోలీసులు..
అయితే ఇలా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడంతో దీనిపై కొందరు అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తుంటే, మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక సినీ విశ్లేషకుడు కూడా ఆరోజు సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఏం చేశాడో క్లుప్తంగా వివరించి అందరిని ఆశ్చర్యపరిచారు. సినీ విశ్లేషకులు మాట్లాడుతూ.. “సంధ్య థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ ర్యాలీ చేస్తూ వచ్చారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట లో ఒక మహిళ చనిపోయింది. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. లేదంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఆ తర్వాత మేము కాపాడలేము” అని పోలీసులు చెబితే.. అల్లు అర్జున్ మాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తించారు.” ఈ పాట అయిపోగానే వెళ్తాను.. క్లైమాక్స్ అవ్వగానే వెళ్తాను.. మధ్యలో నుంచి వెళ్లిపోతే నా సినిమా బాలేదని అందరూ అనుకుంటారు” అంటూ అల్లు అర్జున్ బాధ్యత లేకుండా వ్యవహరించారు. దీంతో ఫైర్ అయిన ఏసీపీ ఆరోజు అల్లు అర్జున్ ని అడిగిన ఒక ప్రశ్న ఆయనను జీవితాంతం వెంటాడుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏం చదువుకున్నావ్..?
అల్లు అర్జున్ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో ఫైర్ అయిన ఏసీపీ అసలు ఏం చదువుకున్నావ్ ? నీకు కామన్ సెన్స్ ఉందా? చెప్తుంటే అర్థం కాదా? అవతల ఒక మనిషి చనిపోయిందని చెబుతుంటే.. నా సినిమా అంటావ్.. నా పాట అంటావ్.. ఆడియన్స్ గురించి చెబుతావ్..అంటూ ఆరోజు ఏసీపీ అల్లు అర్జున్ తో అన్నాడు. నిజంగా ఇది అల్లు అర్జున్ ను లైఫ్ లాంగ్ వెంటాడుతుంది.. మరిచిపోదామన్నా కూడా మరువలేని మాటలవి” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఒకవైపు అల్లు అర్జున్ బాధ్యతారహితంగా ప్రవర్తించాడని పోలీసులు చెబుతుంటే.. మరొకవైపు సంధ్యా థియేటర్లో తీసిన వీడియో క్లిప్పులను కొంతమంది బన్నీ ఫ్యాన్స్ బయటకు వదులుతూ ఇక్కడ పోలీసులు ఎక్కడ ఉన్నారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఇందులో ఏది నిజం? ఎవరు నిజం చెబుతున్నారు? అనే విషయం తెలియడం లేదు అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా నిజానిజాలు తెలిసే వరకు ఎవరిని నేరస్తులుగా పరిగణించకూడదని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.