Qualities: ఏ రాశిలో పుట్టిన అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారో తెలుసా..? అబ్బాయిల్లో వారికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటో మీకు తెలుసా..? అయితే ఈ కథనంలో ఆలాంటి ఇట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశి అమ్మాయిలు అబ్బాయిల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే బాగా ఇష్టపడతారట. అలాగే ఎదుటి వారిని హింసించే వారంటే ఈ రాశి అమ్మాయిలకు అసలు ఇష్టం ఉండదు. గొడవలు చేసేవారు.. పెద్ద తోపుల్లాగా తిరిగే వాళ్లంటే ఈ రాశి అమ్మాయి అసహ్యించుకుంటారట.
వృషభ రాశి: ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలకు నమ్మకంగా ఉండే అబ్బాయిలంటే చాలా ఇష్టమట. వీరికి ఎంత నమ్మకం ఇస్తే వీరు అంత ఎక్కువ ఇష్టపడతారు. అయితే మనసులో ఒకలాగా బయటికి ఒకలాగా ప్రవర్తించే వాళ్లంటే వీరికి అసలు నచ్చదట. అలాగే విచత్రంగా ప్రవర్తించే అబ్బాయిలు అన్నా ఈ రాశి అమ్మాయిలు దూరం పెట్టేస్తారట.
మిథున రాశి: ఈ రాశి అమ్మాయిలకు బాగా మాట్లాడే అబ్బాయిలు అంటే ఇష్టమట. ఎప్పుడూ చలాకీగా ఉంటూ జోకులు వేసే వారంటే ఈ రాశి అమ్మాయిలు ప్రాణం పెట్టేస్తారట. అయితే తెలివిగా మాట్లడకుండా తింగరోడిలా ప్రవర్తించే అబ్బాయిలను వీరు అస్సలు పట్టించుకోరట.
కర్కాటక రాశి: ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలకు ఎమోషనల్ సెంటిమెంట్స్ కాస్త ఎక్కువగా ఉంటాయట. అందుకే భావోద్వేగాలు ఉన్న అబ్బాయిలంటే ఈ రాశి అమ్మాయిలకు ఎంతో ప్రేమ ఉంటుందట. ఎదుటి వారి కష్టాలకు స్పందించే వారంటే వీరు మస్తు లైక్ చేస్తారట. అలాగే ఎం జరిగినా అంటీ ముట్టనట్టు ఉండే వారంటే ఈ అమ్మాయిలకు మహా చిరాకట. అలాంటి అబ్బాయిలను అనుమానంగా చూస్తారట.
సింహ రాశి: ఈ రాశి జాతకులైన అమ్మాయిలకు ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుందట. అలాగే వీరికి లీడర్‌షిప్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయట. అందుకే ఈ రాశి అమ్మాయిలు కూడా ఆత్మగౌరవం.. నాయకత్వ లక్షణాలు ఉన్నా అబ్బాయిలను బాగా ఇష్ట పడతారట. అయితే నటించే వారంటే ఈ అమ్మాయిలకు కోపం వస్తుందట. అలాంటి అబ్బాయిలను వెంటనే దూరం పెడతారట.
కన్యా రాశి: ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలు చిన్న చిన్న విషయాలను కూడా గమనిస్తారు. నిజాయితీ లేని వారిని వీరు అసహ్యించుకుంటారట. నీతి, నిజాయితీ, నిబద్దత కలిగిన అబ్బాయిలను ఈ రాశి అమ్మాయిలు గుండెల్ల పెట్టుకుంటారట.
తుల రాశి: ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలు ఫ్రెండ్షిప్‌కు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. అందుకే వీరు స్నేహపూర్వకంగా ఉండే అబ్బాయిలను బాగా ఇష్టపడతారు. మంచి ప్రవర్తన కలిగిన వారంటే ఇంకా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అలాగే ఈ రాశి అమ్మాయిలకు గొడవలు అంటే మహా చిరాకు ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెట్టుకోవాలని చూసే వారంటే వీరికి అస్సలు నచ్చదట.
వృశ్చిక రాశి: ఈ రాశి జాతకులైన అమ్మాయిలు అంతర్గత భావాలను, నిజమైన సంబంధాలను ఎక్కువగా నమ్ముతారట. అందుకే నిజంగా ప్రేమ కావాలని తపించే అబ్బాయిలను వెంటనే ఈ రాశి అమ్మాయిలు గుర్తిస్తారట. అలాగే విశ్వాసం లేని వ్యక్తులు అంటే ఈ రాశి అమ్మాయిలకు కోపం వస్తుందట. అలాంటి వారిని వెంటనే దూరం పెట్టేస్తారట.
ధనస్సు రాశి: ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలు స్వేచ్చగా జీవించాలని కోరుకుంటారట. అందుకే స్వేచ్చగా జీవించే అబ్బాయిలన్నా సరదాగా ఉండే వ్యక్తులన్నా వీళ్లు ఎక్కువగా ఇష్టపడతారు. ఒకవేళ కఠినమైన మనసున్న వాళ్లు ఎదురైతే వీళ్లు సహించలేరట. కోపంతో వాళ్లను కొట్టినంత పని చేస్తారట.
మకర రాశి: ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలకు నిబద్దత ఎక్కువగా ఉంటుందట. అందుకే పని పట్ల నిబద్దత కలిగిన అబ్బాయిలను ఈ రాశి అమ్మాయిలు తెగ ప్రేమిస్తారట. బాధ్యత లేకుండా గాలికి తిరిగే వారంటే వీరికి పరమ అసహ్యం వేస్తుందట.
కుంభ రాశి: ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలకు కొత్త ఆలోచించడం అన్నా సంప్రదాయంగా ఉండటం అన్నా ఎంతో ఇష్టమట. అందుకే వీరు కోరుకునే పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయిల్లో కూడా కొత్త దనం ఉండాలని అలాగే వాళ్లు సంప్రదాయంగా ఉండాలని కోరుకుంటారట. ఈ రెండు క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలనే కుంభ రాశి అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట.
మీన రాశి: ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలు మంచి మనసు ఉన్న అబ్బాయిలను ఇష్టపడతారట. అలాగే కఠినమైన మాటలతో ప్రవర్తించే వాళ్లను చూస్తే వీరు సహించలేరట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: తెలిసో తెలియకో ఆ పనులు చేశారంటే – దరిద్ర దేవత మీ నెత్తిన తాండవం చేస్తుందట