Anupama Parameswaran Emotional: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం పరదా మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉంది. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. అనుమప వరుస ఇంటర్య్వూస్, ప్రెస్ మీట్లో పాల్గొంటోంది. తాజాగా జరిగిన మూవీ ప్రెస్మీట్లో మూవీ దర్శకుడు, నిర్మాతలతో కలిసి ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ.. ఈ సినిమా చూడండి ప్లీజ్ అంటూ ఆడియన్స్ని కోరింది.
దయచేసి నన్ను సపోర్టు చేయండి
“ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం. చాలా కష్టాలు దాటుతూ తీసిన సినిమా. ఇప్పటికీ కష్టపడుతున్నాం. దయచేసి నా సినిమా చూడండి. నన్ను సపోర్టు చేయండి” అని చెబుతూనే భావోద్వేగానికి లోనైంది. ఈ ప్రెస్మీట్ అంత కూడా అనుపమ దు:ఖాన్ని అణుచుకుంటూ మాట్లాడింది. ఈ క్రమంలో విలేఖరి ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నారని అడగ్గా.. ఒక అమ్మాయి సినిమా చేయడ అంత ఈజీ కాదు అంటూ ఒక్కసారిగా ఏడ్చేసింది. ఆమె ఏమోషనల్ అవ్వడంతో టీం అంతా కాసేపు సైలెంట్ అయ్యింది. ఆ తర్వాత కాసేపటికి తేరుకుని అనుపమ సాధారణ స్థితికి వచ్చింది. అనంతరం ఆమె మాట్లాడింది. ఒక సినిమా చేయడం అంత ఈజీ కాదు.
అందులోనూ అమ్మాయి లేడీ ఒరియంటెడ్ సినిమా చేసి ముందుకు రావడం చాలా కష్టం. మూవీ చేయడానికి కన్నా రిలీజ్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. నా సినిమా కాబట్టి చూడమని చెప్పడం లేదు. ఇది ఒక మంచి సినిమా..అమ్మాయి సినిమా కాబట్టి చూడమంటున్నా. నేను చేసిన చాలా సినిమాలు నాకే నచ్చవు. వాటిని నేనే విమర్శిస్తుంటా. కానీ ఇందులో విమర్శించడానికి ఏం లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రెస్మీట్ అనుపమ కన్నీరు పెట్టుకోవడంతో.. ఈ సినిమా కోసం ఆమె ఎంతగా కష్టపడిందో అర్థమౌవుతోంది అంటున్నారు నెటిజన్స్. నిజానికి పరదా సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది.
ఆగష్టు 22న రిలీజ్
కానీ, వరుసగా పెద్ద చిత్రాలు రిలీజ్ ఉండటంతో పరదాకు థియేటర్లు దొరకడం లేదు. దీంతో ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తోంది. ఎట్టకేలకు ఈ చిత్రం ఆగష్టు 22న విడుదలకు సిద్ధమైంది. దీంతో మూవీ టీంతో కలిసి తన వంతుగా అనుపమ వరుసగా ఇంటర్య్వూలో ఇస్తూ బిజీ అవుతుంది. కాగా ప్రేమమ్ చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామ శతమానం భవంతి మూవీతో టాలీవుడ్కి పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసిన అవి బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయాయి. దీంతో అనుపమకు ఆఫర్స్ తగ్గిపోయాయి. చివరిగా టిల్లు స్క్వేర్లో గ్లామర్ షో చేసి ఫ్యాన్స్కి షాకిచ్చింది. ఇందులో అనుపమ గ్లామర్కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. కానీ, అప్పటి వరకు సంప్రదాయంగా కనిపించిన ఆమె టిల్లు స్క్వేర్లో లిప్ కిస, గ్లామర్ షో చేసి విమర్శలు ఎదుర్కొంది.
Also Read: Coolie Gold Ring Sale: బాబోయ్ కూలీ మేనియా మామూలుగా లేదు.. చివరికి గోల్డ్ రింగ్‌ని కూడా వాడేసారు..