Girl Names: ఆడపిల్లలకు ఆ పేర్లు అస్సలు పెట్టకూడదట. పెడితే వారు జీవితాంతం కష్టాలు పడాల్సి వస్తుందట. పైగా వారికి రాక్షసుల లాంటి భర్తలు వస్తారట. అసలు ఇంతకీ ఆడ పిల్లలకు పెట్టకూడని పేర్లేంటి..? పెడితే వాళ్లకు వచ్చే కష్టాలేంటి..? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
హిందూ ధర్మం ప్రకారం ఒక వ్యక్తి తల్లి గర్బంలో పడిన దగ్గర నుంచి ఆ వ్యక్తి పుట్టి మరణించే వరకు పదహారు ఆచారాలు పాటిస్తారు. వాటిలో నామకరణ చేయడం అనేది కూడా ఒక ముఖ్యమైన తంతు. నామకరణ ఒక వ్యక్తి జీవితంలో గొప్ప ప్రభవాన్ని చూపుతుంది. అందుకే ఒకరికి పేరు పెట్టే ముందు చాలా ఆలోచించాలి. శిశువు పుట్టిన పది రాత్రులు గడిచిన తర్వాత నామకరణం చేయాలని శాస్త్రం చెప్తుందట. నామకరణం రోజున పుట్టిన రోజు గ్రహాలు, దిశ, తేదీ, సమయం వంటి అనేక ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని నామకరణం చేయాలని చెప్తున్నారు. శాస్త్రాల ప్రకారం అష్టమి, చతుర్ధశి, అమవాస్య మరియు పౌర్ణమి రోజులలో పేర్లు పెట్టకూడదట. అయితే అమ్మాయిలకు ఏలాంటి పేర్లు అసలు పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
పాండవులు భార్య పాంచాలినే ద్రౌపది అంటారు. ఈ పేరు ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిలకు పెట్టకూడదట. ద్రౌపతి మహా ప్రతివ్రత అయినప్పటికీ ఆమెకు అయిదుగురు భర్తలు ఉండటం వల్ల ఆ పేరును పెట్టకూడదట. పెడితే చాలా ఘోరాలు జరుగుతాయని అలాగే ద్రౌపతి పడిన కష్టాలు ఆ పేరు పెట్టుకున్న వాళ్లు కూడా పడే అవకాశం ఉంటుందని చెప్తుంటారు.
ఈమె రావణాసురుడి భార్య. రామాయణంలో మండొదరి చాలా మంచి వ్యక్తి కానీ ఈమె పేరును కూడా అమ్మాయిలకు పెట్టకూడదట. ఒకవేళ ఎవరైనా పెడితే వారికి రావణుడి లాంటి భర్త వస్తాడని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ పేరు అసలు పెట్టరు.
అమ్మాయిలకు పెట్టకూడని మరో పేరు మందర. మందర చెడుబుద్ది ఉంటుంది. రాముడు అరణ్యవాసం వెళ్లడానికి మందరే కారణం అందుకే ఈ పేరు ఆడపిల్లలకు పెట్టకూడదు అంటారు.
ఈ పేరు కూడా అమ్మాయిలకు పెట్టకూడదు అంటారు. ఎందుకంటే సీతారాములు అడవి పాలు కావడానికి కైకేయి కూడా ఒక కారణం. అందుకే ఈ పేరును అమ్మాయిలకు పెట్టకూడదట.
ఈ పేరును కూడా ఆడపిల్లలకు పెట్టకూడదట. తులసి అనే పేరు పెట్టడం వల్లన వారికి రాక్షసుడి లాంటి భర్త వస్తాడట. వారి జీవితం నరకంలా మారుతుందని చెప్తుంటారు.
ఇక పిల్లలను ఎప్పుడూ నిక్‌నేమ్‌తో పిలవకూడదట. పూర్తి పేరుతోనే పిలవాలట. అలాగే ముద్దు పేర్లతో కూడా పిలవకూడదు. వారి పుట్టిన నక్షత్రానికి సరిపోయే అక్షరంతోనే వారి పేరు ఉండాలని సూచిస్తున్నారు పండితులు.
పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం – అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.