BigTV English

UPI New Rules: యూపీఐ కొత్త రూల్స్.. ఆగష్టు 1 నుంచి అమల్లోకి.. ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి

UPI New Rules: యూపీఐ కొత్త రూల్స్.. ఆగష్టు 1 నుంచి అమల్లోకి.. ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి

UPI New Rules:  యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్-UPI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI కొత్త రూల్స్ ఆగస్టు ఒకటి అనగా శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. దీనివల్ల కొన్నివర్గాల ప్రజలు, వ్యాపారులపై ప్రభావాన్ని చూపే అవకాశముందని అంటున్నారు కొందరు మార్కెట్ నిపుణులు.


2016లో ప్రారంభమైన UPI మనీ ట్రాన్స్‌ఫర్ టెక్ యుగంలో కీలకంగా మారింది. డిజిటల్ చెల్లింపులలో దాదాపు 75 శాతం వాటాను కలిగివుంది. ఈ ఏడాది జులై నాటికి రూ. 24 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో NPCI నిబంధనలలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. బ్యాలెన్స్‌ చెకింగ్, ఆటో పేమెంట్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలు వచ్చాయి.

1. బ్యాలెన్స్ తనిఖీలు-ఖాతా వీక్షణలపై పరిమితులు


బ్యాంకు ఖాతాలో డబ్బులు ఎంత ఉందో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. యూపీఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌పే యాప్స్ సాయంతో కేవలం క్షణంలో తెలుసుకునే అవకాశం ఏర్పడింది. బ్యాంకు శాఖ లేదా ఏటీఎంకు వెళ్లే అవసరం తప్పింది. డబ్బులు ఎంత ఉన్నాయని చెక్‌ చేసుకునే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి పరిమితి లేదు.

ఇప్పుడు వాటిపై పరిమితి విధించింది. రోజులో 50 సార్లు బ్యాలెన్స్‌ చెక్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబరుపై ఎన్ని బ్యాంకు ఖాతాలు లింక్‌ అయ్యాయో కేవలం 25 సార్లు మించి చూడడం అసాధ్యం. నెట్‌వర్క్‌పై భారం తగ్గించడం కోసం వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా బ్యాంకులు, యూపీఐ సర్వీసు సంస్థలకు ఎన్‌పీసీఐ ఆయా ఆదేశాలు జారీ చేసింది.

ALSO READ: ఇక పిన్ లేకుండా యూపీఐ చెల్లింపులు, అదెలా?

2. ఆటోపే ఆఫ్-పీక్ గంటలకు మారుతుంది

ఆటో పేమెంట్‌ లావాదేవీల విషయంలో ఎన్‌పీసీఐ మార్పులు చేసింది. సబ్‌స్క్రిప్షన్లు, యుటిలిటీ బిల్లులు, ఈఎంఐ వంటి ఆటో పేమెంట్‌లను రద్దీ లేని సమయంలో చేపట్టాలి. ఆటో పేమెంట్ రిక్వెస్ట్‌ పెట్టే సంస్థలు రద్దీ లేని సమయంలో యూపీఐ కలెక్షన్‌ రిక్వెస్ట్‌ను షెడ్యూల్ చేయాలి.

ఉదయం 10 గంటల ముందు, మధ్యాహ్నం ఒంటి నుంచి 5 గంటల ముందు, రాత్రి 9:30 గంటల తర్వాత మాత్రమే. ఒక వేళ 10 గంటలు దాటిన తర్వాత చెల్లించడం కుదరదు. అయితే ముందుగా లేదంటే మిగతా సమయాల్లో చెల్లించాలి. లేకుంటే రిమైండర్‌ను సెట్ చేసుకోండి. లేకుంటే సంబంధిత సంస్థను నోటీసు వచ్చే అవకాశం ఉంది.

3. విఫలమైన లావాదేవీలకు 3 ప్రయత్నాలు

UPI ద్వారా చెల్లింపు జరగలేదని నిరాశ చెందుతున్నారా? వాటిని తనిఖీ చేయడానికి కేవలం 3 అవకాశాలు ఉంటాయి. పునఃప్రయత్నాల మధ్య తప్పనిసరిగా 90 సెకన్లు సమయం ఉండాల్సిందే. ఇది కేవలం ఒక చిన్న మార్పు మాత్రమే. దీనివల్ల సర్వర్ ఓవర్‌లోడ్‌ను తగ్గించడం ప్రధాన ఉద్దేశం.

4. UPIపై GST లేదు

UPI సేవలపై జీఎస్టీ ఉందంటూ రకరకాలుగా వార్తలు వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతున్నాయి. UPI లావాదేవీలపై ఇప్పటికీ ఎలాంటి GST లేదు. రూ.2,000 కంటే ఎక్కువ చెల్లింపులు వినియోగదారులకు ఉచితం. వ్యాపారులకు ప్రత్యేకంగా ఛార్జీలు ఉంటాయి.

5. గ్రహీత పేరు ఇప్పుడు చూపబడుతుంది

UPI ద్వారా డబ్బు పంపిన ప్రతిసారీ నిర్ధారించే ముందు మీరు రిజిస్టర్డ్ పేరును చూస్తారు. అప్పుడు మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఒక్కోసారి రీసైకిల్ చేసిన మొబైల్ నెంబర్లను ఉపయోగించి మోసపూరిత లావాదేవీలు జరగకుండా నిరోధించడంలో ఉపయోగపడనుంది. వినియోగదారు భద్రతను మెరుగుపరచడంలో సహాయ పడుతుంది.

ఈ నిబంధనల వల్ల సాధారణ వినియోగదారులపై పెద్దగా ప్రభావం ఉండదు. రోజులో ఎక్కువ సార్లు బ్యాలెన్స్ చెక్ చేయరు. వ్యాపారులకు కాస్త ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఆ పరిమితికి మించి చేసినప్పుడే ఆయా యాప్ సంస్థలు వాటిని గుర్తిస్తారు. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే వాటిని వినియోగించే వారికి కొత్త నిబంధనలు వర్తించనున్నాయి.

Related News

Bank Holidays: ఏంటీ ఆ మూడు రోజులు బ్యాంక్ పనిచేయవా.. ముందుగా ప్లాన్ చేసుకోండి ఇలా..

Jio Mart vs D-Mart: రిలయన్స్ ఫ్రెష్, డి-మార్ట్.. దేనిలో ధరలు తక్కువ, ఎందుకు?

Gold Mines: ఆ ప్రాంతంలో లక్షల టన్నుల బంగారం.. తవ్వే కొద్ది బయటపడుతోన్న గోల్డ్.. ఎక్కడో తెలుసా?

Jio Offers: ఎగిరి గంతేసే వార్త.. జియో తక్కువ ధరకే అదిరిపోయే బెనిఫిట్స్

D-Mart: డి-మార్ట్‌ లో అత్యంత చౌకగా లభించే వస్తువులేంటీ? ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తారు?

PAN 2.0: పాన్ 2.0.. అప్‌డేట్ వెర్షన్, అయితే ఏంటి?

Big Stories

×